స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’.కాగా ఆగస్ట్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది సభ్యులతో స్టార్ట్ చేస్తారట. పైగా సభ్యులందరికీ కరోనా టెస్ట్ చేసి, వారికీ కరోనా సోకే అవకాశం లేకుండా టీమ్ అందర్నీ షూట్ జరుగుతున్న అంత కాలం జన సాంద్రతకు దూరమైన ప్రాంతంలోనే ఉంచాలని టీమ్ భావిస్తోందట.
ముఖ్యంగా పుష్ప చిత్రబృందం వారు ఇతరులను కలవడం గాని.. ఇతరులు వారున్న ప్రదేశానికి రావడం గాని లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారట. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసిందట చిత్రబృందం. అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్ గా తీరిగ్గా కూర్చుని మరీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడట. ఇప్పటికే నాలుగు ట్యూన్స్ కంపోజ్ చేశాడట. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా సుకుమార్, సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.