మీరా చోప్రాకు స్టార్ హోటల్ లో చెత్త అనుభవం

ఫుడ్ లో పురుగులు …హీరోయిన్‌ షాక్

సామాన్యుల సంగతి వదిలేస్తే సెలబ్రెటీలకు మంచి ఫెసిలిటీస్ ఉంటాయని అంతా భావిస్తాం. ఎందుకంటే ఎంత డబ్బు కావాలంటే అంత ఖర్చు పెట్టగలుగుతారు. ఆహారానికి, ఆరోగ్యానికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తారు. అయితే అంత ఖర్చు పెట్టినా ఒక్కోసారి ఫలితం ఉండదు. మనలాంటి వాళ్లు తినే ఆహారం కూడా దొరకదు. లేకపోతే ఫైవ్ స్టార్ హీటల్ లో దిగిన హీరోయిన్ కు పురుగులతో కూడిన ఫుడ్ దొరకటం ఏమిటి..వింత కాకపోతే.

ఇలాంటి చేతు సంఘటన హీరోయిన్ మీరా చోప్రాకు ఎదురైంది. ఈ అమ్మడు గుజరాత్ అహ్మదాబాద్‌లో డబుల్ ట్రీ హెల్టన్ అనే ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసింది. సదరు హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేసింది. తీరా వచ్చిన ఫుడ్‌లో తెల్ల పురుగులు ఉండటం చూసి షాకవడం మీరాచోప్రా వంతైంది. వెంటనే దాన్ని వీడియోగా తీసి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఫేస్ చేసింది.

ఎంతో డబ్బులు చెల్లించి ఇలాంటి హోటల్స్‌లో ఉంటే వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మీరా చోప్రా పవన్ కల్యాణ్‌తో ‘బంగారం’ సినిమాలో నటించింది. ఈ విషయమై ఆమె ట్వీట్ చేసింది.