స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. కాగా ఆగస్ట్ 20 నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. దాంతో ఫిల్మ్ సిటీలోని అటవి సెటప్ లోనే షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక మిగతా సీన్స్ కోసం హైదరాబాద్ లోని o ప్రైవేటు ప్లేస్ లో భారీ సెట్స్ నిర్మిస్తారట. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది సభ్యులతో స్టార్ట్ చేస్తారట.
ఇక ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసిందట చిత్రబృందం. అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈసారి కూల్ గా తీరిగ్గా కూర్చుని మరీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. ప్రస్తుతం దేవి ఐటమ్ సాంగ్ ను కంపోజ్ చేసే పనిలో ఉన్నాడట. మరి సుకుమార్ – దేవీ కాంబినేషన్‌లో ఐటం సాంగ్స్ అంటే ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. మొత్తానికి పుష్ప సినిమా కోసం దేవి ప్రిపేర్ చేసే ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఊపేస్తుందనడంలో సందేహం లేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు