స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తోన్న ‘పుష్ప’ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ సేతుపతి బన్నీకి సారీ చెప్పేశాడు. ఈ విషయం గురించి తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. కేవలం డేట్స్ ఎడ్జెస్ట్ కాకనే పుష్ప సినిమా నుండి తప్పుకున్నానని ఆయన తెలిపారు. నిజానికి విజయ్ పుష్ప కోసం ఏప్రిల్ లో ఇరవై రోజులు, జూన్ లో పదిహేను రోజులు డేట్స్ ఇచ్చాడు. అయితే కరోనా వైరస్ కారణంగా షూట్ క్యాన్సల్ అవ్వడం, విజయ్ సేతుపతి డేట్స్ క్లాష్ అవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు డేట్స్ కుదరక ఈ సినిమా నుండి విజయ్ తప్పుకున్నాడట.
అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు గానీ, పుష్ప టీంకి సంబంధించిన వ్యక్తుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ‘విజయ్ సేతుపతి’ పుష్ప సినిమా నుండి తప్పుకున్నాడు అని. బన్నీ కలలు కన్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’తో తీరాలంటే పాన్ ఇండియా స్టార్స్ ఈ సినిమాలో యాక్ట్ చెయ్యాలి. ఈ సినిమా అప్పుడే పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది. మరి సుకుమార్ స్టార్ కాస్ట్ ను పాన్ ఇండియా లెవల్ లోనే తీసుకోవటానికి ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోవడం బెటర్.
ఇక సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్ కోసం అయితే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అలాగే విలన్ గా కూడా ఏ సంజయ్ దత్ నో, సునీల్ శెట్టినో ఒప్పించాలని సుకుమార్ అనుకుంటున్నాడట. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా క్యూట్ బేబీ రష్మిక మందన్న నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. బన్నీ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకోవాలని ఆశిద్దాం.