Home Bollywood రొమాంటిక్ సాంగ్ తో 'పుష్ప' స్టార్ట్ కానుందా ?  

రొమాంటిక్ సాంగ్ తో ‘పుష్ప’ స్టార్ట్ కానుందా ?  

 
స్టైలిష్ స్టార్  అల్లు  అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్  కలయికలో  రాబోతున్న సినిమా   ‘పుష్ప’.కాగా ఆగ‌స్ట్ నుండి ఈ చిత్రం  షూటింగ్ స్టార్ట్  చేయాల‌ని ప్లాన్ చేస్తున్న  విషయం తెలిసిందే.  అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో  స్టార్ట్ చేస్తారట. పైగా స‌భ్యులంద‌రికీ కరోనా టెస్ట్ చేసి, వారికీ కరోనా సోకే అవకాశం లేకుండా టీమ్ అందర్నీ షూట్ జరుగుతున్న అంత కాలం  జన సాంద్రతకు దూరమైన    ప్రాంతంలోనే ఉంచాలని టీమ్ భావిస్తోందట.
 
ముఖ్యంగా  పుష్ప చిత్రబృందం వారు ఇత‌రుల‌ను క‌ల‌వ‌డం గాని.. ఇత‌రులు వారున్న ప్ర‌దేశానికి రావడం గాని లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ట. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక  పై రొమాంటిక్ సాంగ్  షూట్  చేయనున్నారు. అన్నట్టు  ఈ సినిమాలో  ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ  ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసిందట చిత్రబృందం. అలాగే  తమిళ హీరో విజయ్‌ సేతుపతి  కూడా ఈ సినిమాలో   పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు.
 
ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.  ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడ‌ట‌‌.  ఇప్పటికే నాలుగు ట్యూన్స్ కంపోజ్ చేశాడట.  ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా సుకుమార్, సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.  
- Advertisement -

Related Posts

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

షారుక్ మూవీ.. పాన్ ఇండియా ఇండియా అంటున్నారే

షారుక్ మూవీ.. పాన్ ఇండియా ఇండియా అంటున్నారే

మరో హిస్టారికల్ బయోపిక్ లో కాంట్రవర్సీ క్వీన్

బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అనే కాకుండా కాంట్రవర్సీ క్వీన్ అని తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బ్యూటీ కంగనా రనౌత్. ఈ సీనియర్ హీరోయిన్ ఎలాంటి సినిమా చేసినా కూడా బ్యాక్...

సీక్రెట్ బయటపడింది.. గూగుల్‌లో అవి సర్చ్ చేసిన దీపిక పదుకొణె

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడుస్తోంది. తారలందరూ కూడా అదే బాటలో నడుస్తున్నారు. వెరైటీ చాటింగ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో తారలు వారి ఫ్యాన్స్‌తో ముచ్చటించేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఏ...

Latest News