కత్రినా కైఫ్‌ని అవమానించిన అభిమాని

ద‌బాంగ్ టూర్‌లో క‌త్రినా కైఫ్‌కి చేదు అనుభ‌వం ఎదురైంది. సల్మాన్ ఖాన్ ప్రారంభించిన ఈటూర్‌లో భాగంగా కత్రినా, సోనాక్షి సిన్హా, జాక్విలిన్ ఫెర్నాండేజ్, డైసీ షా తదితరులు విదేశాలలో ప్రదర్శనలు ఇస్తున్నారు. కెనడాలోని వాంకోవర్ లో ప్రదర్శన ముగించుకుని రూంకి బయలుదేరుతుండగా అభిమానులు సెల్ఫీ కోసం వెంబడించారు కత్రినాని. కొందరికి అవకాశమిచ్చిన కత్రినా ఇంకా చాలు, చాలా అలసిపోయాము. దయచేసి అర్ధం చేసుకోండి అని కొంచెం గట్టిగా చెప్పి వెళ్లిపోతుండగా ఒక యువతి ‘నీ ఫోటోలు మాకు వద్దు’ అంటూ గట్టిగా అరిచింది.

అలా కామెంట్ చేసిన యువతిని ఉద్దేశించి ‘ప్రదర్శన అయ్యాక మేము చాలా అలసిపోయాం..దయచేసి అర్ధం చేసుకోవాలి’ అని రిప్లై ఇచ్చింది కత్రినా. కత్రినా వ్యాఖ్యలను అంగీకరించని ఆ మహిళ ప్రతి స్పందిస్తూ ‘నీకు నువ్వు గొప్ప హీరోయిన్ గా చెప్పుకుంటావ్, నీ అభిమానులతో ఎలా ప్రవర్తించాలో తెలియదు నీకు.. ముందు నీ ప్రవర్తన మార్చుకో అంటూ..’ ఘాటుగా హితవు పలికింది. కత్రినా సెక్యూరిటీ ఆమెను వారించినా వినలేదు ఆ మహిళ. పైగా ‘మేము నీకోసం రాలేదు సల్మాన్ ఖాన్ కోసం వచ్చాము, కేవలం సల్మాన్ కోసం’ అని అరుస్తూ కత్రినాని అవమానించింది.