పవన్ పై పేర్ని సెటైర్స్… కవిత కామెడీ డైలాగ్స్ వైరల్!

ఒక్కోసారి పవన్ కామెంట్లను సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించే ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని… చాలా సందర్భాల్లో మాత్రం వీలైనంత కామెడీగానే తీసుకుంటుంటారు. పవన్ ఏమాత్రం సీరియస్ పొలిటీషియన్ కాదని బలంగా నమ్మే నేతల్లో ఒకరైన పేర్ని… తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలంటూ పవన్ చేసిన డిమాండ్స్ పై ఆయన విడియోలనే చూపిస్తూ సమాధానాలు చెప్పడం గమనార్హం!

పవన్ విమర్శలకు ప్రతివిమర్శఒక్కోసారి పవన్ కామెంట్లను సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించే ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని… చాలా సందర్భాల్లో మాత్రం వీలైనంత కామెడీగానే తీసుకుంటుంటారు.లు చేసే విషయంలో కొత్త పంథా ఎంచుకున్న పేర్ని నాని… గతంలో పవన్ ప్రసంగాల్లోని కొన్ని బైట్స్ ని టీవీ స్క్రీన్ పై ప్రదర్శిస్తూ… సమాధానాలు ఇచ్చారు. గతంలో తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పాలంటూ కవిత చేసిన డిమాండ్ పై పవన్ స్పందిస్తూ… “ఏమిటమ్మా… క్షమాపణలు చెప్పాలా.? క్షమాపణలు చెప్పాలా లేదా అన్నది మాకూ మాకు సంబందించిన వ్యక్తిగత విషయం.. మీకు చెప్పాల్సిన అవసరం లేదు” అని అన్నారు! ఇప్పుడు ఆ వీడియోని ప్రదర్శించిన నాని… పవన్ కు మా సమాధానం కూడా “అదే” అని క్లారిటీ ఇచ్చారు!

పవన్ కల్యాణ్ పై పేర్నినాని సెటైర్లు | Perni Nani Satires on Pawan Kalyan -TV9

ఇక ఉన్నఫలంగా తెలంగాణ మంత్రులపైనా, బీఆరెస్స్ నేతలపైనా పవన్ చేస్తున్న వకీల్ పనులకు కారణం తనకు తెలియదని… కానీ, పవన్ ఎంతగానో అభిమానించే చంద్రబాబు గుండేకాయ అయిన ఏబీఎన్ రాధాకృష్ణ గతంలో చేసిన “పలుకుల” బైట్ ను ప్రదర్శించారు. అందులో… పవన్ కు కేసీఆర్ 1000కోట్ల ప్యాకేజీ టాపిక్ ఉండటం గమనార్హం! దీంతో… పవన్ కామెంట్లపై తానేమీ స్పందించాల్సిన అవసరం లేదన్నట్లుగా… వీడియోలు ప్రదర్శిస్తూ… చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పారని అంటున్నారు విశ్లేషకులు!

కాగా… “ఒక సీరియ‌స్ సినిమా న‌డుస్తున్న టైంలో బ్ర‌హ్మానందం వ‌చ్చి కామోడీ చేసిన‌ట్లు.. సీరియ‌స్ పాలిటిక్స్ న‌డుస్తున్న‌ప్పుడు సడన్ గా ప్రత్యక్షమయ్యే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంట్రీ కూడా అలాంటిదే” అని గ‌తంలో ఎమ్మెల్సీ క‌విత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఆ వీడియోని షేర్ చేసేపనిలో ఉన్నారు వైకాపా శ్రేణులు!

Pawan Kalyan Entry is like Brahmanandam Comedy in Politics: Kavitha