చిరంజీవికి నారాయణ క్షమాపణ వెనుక ‘పచ్చ’ రాజకీయం.?

Chiranjeevi

సీపీఐ నేత నారాయణ, మెగాస్టార్ చిరంజీవికి దండం పెట్టి మరీ క్షమాపణ కోరిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తదనంతర పరిణామాల నేపథ్యంలో నారాయణ ‘మెగా సెగ’ గట్టిగానే ఎదుర్కొన్నారు. దాంతో, ఆయన క్షమాపణ చెప్పక తప్పలేదు.

అయితే, ఈ మొత్తం వ్యవహారం వెనుక టీడీపీ పాత్ర ఎంత.? అన్నదానిపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. పైగా, ‘కమ్మ’కులాభిమానం నరనరానా జీర్ణించుకుపోయిందాయనకి.! పేరుకే కామ్రేడ్.. కానీ, కుల దురాభిమానం ఆయనలో ఎక్కువనే చర్చ తరచూ జరుగుతుంటుంది.

సరే, ఆ సంగతి పక్కన పెడితే, కాపు సామాజిక వర్గమంతా ఒక్కతాటిపైకి వచ్చి, నారాయణ మీద విరుచుకుపడ్డంతో తమ కుట్ర బయటపడిపోయి, తమకు ఎక్కడ ఆ కాపు సామాజిక వర్గం దూరమవుతుందోనని టీడీపీ కలత చెంది, నారాయణతో చిరంజీవికి క్షమాపణ చెప్పించిందనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది.

చిరంజీవికి వ్యతిరేకంగా, నారాయణకు మద్దతుగా సోషల్ మీడియాలో నినదించిన చాలామంది టీడీపీ సానుభూతిపరులు, ఒకేసారి వెనక్కి తగ్గడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిలో కొందరు ఇప్పటికీ నారాయణను కొంతమేర సమర్థిస్తుండడం గమనార్హం.

ఏదిఏమైనా సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంపాదించుకున్న పేరుని నారాయణ, చిరంజీవి మీద జుగుప్సాకరమైన విమర్శలతో చెడగొట్టుకున్నమాట వాస్తవం.