ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి గట్టి షాక్ తగిలింది. సోమిరెడ్డి సోదరుడు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆదివారం వైసిపిలో చేరారు. నెల్లూరు జిల్లా వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. సోమిరెడ్డి అవినీతిని చూడలేకే టిడిపి నేతలు పార్టీని వీడి వైసిపిలో చేరుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపి భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సోమిరెడ్డి బావ రామకోటారెడ్డి కూడా గత కొద్ది రోజుల కింద వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. దీంతో సోమిరెడ్డికి స్వంత కుటుంబం నుంచే ఎదురు దెబ్బలు తాకుతున్నాయి.