నారా నాదెండ్ల పవన్.. వైసీపీ నేతల కౌంటర్లు మామూలుగా లేవా?

Pawan Kalyan

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పూర్తిస్థాయిలో సినిమాలకే పరిమితమయ్యారనే సంగతి తెలిసిందే. ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి పలు రాజకీయ పార్టీలు ఆసక్తి చూపిస్తున్నా చిరంజీవి మాత్రం తనకు రాజకీయాలు అంటే ఏ మాత్రం ఆసక్తి లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు మాత్రం చిరంజీవి జనసేనలో యాక్టివ్ అయ్యేలా చెయ్యాలని ఉంది. చిరంజీవికి జనసేనకు సపోర్ట్ చేయకపోగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం పవన్ ను మరింత బాధ పెడుతోంది.

గత కొన్నిరోజులుగా జగన్ చిరంజీవిని అవమానించారని పవన్ కళ్యాణ్ పదేపదే విమర్శలు చేస్తుండగా వైసీపీ నేతలు మాత్రం తాము చిరంజీవికి వీరాభిమనులని చెబుతున్నారు. నారా నాదెండ్ల పవన్ అంటూ వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేయడం గమనార్హం. పవన్ వైసీపీ విముక్త ఏపీ అని అన్నారంటే బాబుతో పవన్ కు డీల్ కుదిరినట్లేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్లు చేయడం గమనార్హం.

వైసీపీ నేతల సెటైర్లపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలేలా మెగాస్టార్ మావాడు అంటూ వైసీపీ నేతలు చెప్పడం గమనార్హం. చిరంజీవిపై పవన్ చేస్తున్న కామెంట్లు బాలేవని చెబుతూ వైసీపీ నేతలు పవన్ పరువు తీసేశారు. ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటి లంచాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్టు పవన్ ప్రూవ్ చేయాలని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

వైసీపీ నేతల కౌంటర్లు మామూలుగా లేవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేనానికి వైసీపీ నేతలు తమ విమర్శల ద్వారా భారీ షాకులిస్తున్నారు. వైసీపీ నేతలు తమకు ఎదురవుతున్న విమర్శల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వైసీపీ నేతలు జనసేన పార్టీకి, జనసేన అధినేత పవన్ కు విమర్శలతోనే చుక్కలు చూపిస్తుండటం గమనార్హం.