Home Andhra Pradesh సిఎం ర‌మేష్‌కు అంత డబ్బు ఎలా వచ్చింది? అంబటి చెప్పిన రహస్యం

సిఎం ర‌మేష్‌కు అంత డబ్బు ఎలా వచ్చింది? అంబటి చెప్పిన రహస్యం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధికారప్రతినిధి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం రమేష్ పై జరిగిన ఐటి దాడులపై స్పందించారు. సీఎం రమేష్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, సీఎం రమేష్ లను తీవ్ర విమర్శలతో దుయ్యబట్టారు. సీఎం రమేష్ కి డబ్బు ఎలా వచ్చిందో చెబుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చూడండి.

-సిఎం రమేష్ పై ఐటి సోదాలు జరిగితే అధికారపార్టీకి భయమెందుకు?

-ఐటి దాడులను ప్రేరేపిత దాడులుగా చిత్రీకరిస్తున్నారు.

-మీసం మెలేస్తున్నావే…నీ చరిత్ర ఏంటి? రిత్విక్ సంస్ద ఎప్పుడైనా భారీ కాంట్రాక్ట్ లు చేసిందా?

-రిత్విక్ సంస్దవన్నీ సబ్ కాంట్రాక్ట్ లే… అన్నీ బెదిరించి తీసుకున్నవే.

-చంద్రబాబుకు నెంబర్ 1 బినామి సిఎం రమేష్.

-బిజేపి-టిడిపి నాలుగేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తేడా ఎక్కడ వచ్చింది?

-పార్టీ మారితే సమస్యలు సాల్వ్ అయిపోతాయని ఐటి అధికారులన్నారని సిఎం రమేష్ చెబుతున్నారు.

-ఆ మాటలు మీ ఇంటిలిజెన్స్ ఛీఫ్ వెంకటేశ్వరరావు, చంద్రబాబు వద్ద ఎప్పుడూ వినేవే.

-ఆలీబాబా నలభై దొంగలు సినిమాలోలా నీ వేలిముద్ర ఉంటేనే తెరుచుకునే లాకర్లు ఇంట్లో ఉండటమేంటి?

-మీ జీవితభాగస్వామికి గాని, రక్తసంభందీకులకు గాని తెలియకుండా ఆ మాళిగలో ఏమి దాచావ్? .

నీవు ఒకరి బినామివి…గజదొంగవి…బ్రోకర్ వి కాబట్టే అలాంటి లాకర్లు ఇంట్లో పెట్టుకున్నావ్.

– ఇవన్నీ చేస్తూ మీసం మెలేస్తున్నావా? పచ్చకాలం అంటే ఇదే మరి.

సారా కాంట్రాక్టర్ ఈ దశకు రావడానికి గెస్ట్ హౌస్ రాజకీయాలే కారణం.

-ఇది పచ్చకాలం కాబట్టి వైఎస్ జగన్ గురించి మాట్లాడుతున్నారు.

-ఆయన మీసం మెలేస్తే కింద ఐటి వాళ్లు తొడగొడుతున్నారు.

-వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత సిఎం రమేష్ కు ఉందా?

-సిఎం రమేష్ పచ్చకాలం…కలకాలం ఉండదు జాగ్రత్త. బడిత పూజ చేసే రోజులు ముందున్నాయ్.

- Advertisement -

Related Posts

టెన్త్ ఎగ్జామ్స్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం !

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాది పరీక్షలు లేకుండా పదో తరగతి విద్యార్థులను పాస్ చేశారు. ఇంటర్నల్ మార్క్‌లు, అటెండెన్స్ ఆధారంగా గ్రేడ్‌లు కేటాయించారు. అయితే , ఈసారి కూడా క్లాసులు...

విజయ డెయిరీ ఎన్నికలు : పాతికేళ్ల భూమా వర్గం ఆధిపత్యానికి చెక్ .. వైసీపీ వర్గం ఘనవిజయం !

కర్నూలు జిల్లా నంద్యాలలో విజయ డెయిరీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ అనుకూలురైన రవికాంత్ రెడ్డి, ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి...

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా ఎప్పుడూ జరగలేదు .. వారిపై కేసు వేస్తా : వైసీపీ ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా తాను అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని, అధికారులతో తాడో పేడో తేల్చుకుంటానని ,ప్రజాప్రతినిధులకు జరిగిన అవమానం రాజ్యాంగ విరుద్ధంగా...

వైభవంగా రామతీర్థంలో సీతారామలక్ష్మణ విగ్రహాల ప్రతిష్ట

విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని రామతీర్థం బోడికొండపై రాముడి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఆలయంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించాలని దేవాదాయ శాఖ...

Latest News