వామ్మో.. పవన్ మాల అట.. వైరల్ అవుతున్న పిక్స్!

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మేనియా గోదావరి జిల్లా లో మామూలు గా ఉండదు. పవన్ పేరు చెబితేనే జనాలు ఊగిపోతారు. అలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. ప్రతి హీరో కి ఒక రకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం వేరే రేంజ్ లోనే ఫ్యాన్స్ ఉన్నారని ఇది చూసాక చెప్పుకోవచ్చు.

దేవుడు మీద భక్తి తో అయ్యప్ప మాల, శివుని మాల, హనుమాన్ మాల, ధరించడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ పవన్ అభిమానులు ఏకంగా పవన్ నే దేవుడు గా భావించి.. ‘పవన్ మాల’ ను ధరించారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది. ఇది చూస్తే వీళ్ళ అభిమానం హద్దులను దాటి పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయింది అనే చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, విజయవాడ కు చెందిన కొందరు పవన్ అభిమానులు.. పవన్ కళ్యాణ్ 49 వ జన్మదినోత్సవం సందర్భంగా ‘ పవన్ మాల’ స్వీకరించి దీక్ష చేస్తున్నారు.

దీక్ష అంటే ఒక రోజు, రెండు రోజులు కాదు ఏకంగా 49 రోజులు దీక్ష చేపట్టనున్నారు పవన్ అభిమానులు. దీక్షను చేపట్టిన పవన్ అభిమానులు పవన్ కార్యక్రమాలను, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని.. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం కోసం ప్రచారం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే పవన్ ఇచ్చిన స్ఫూర్తి తో ఆయన వలె ప్రజా సేవ చేస్తామని, పవన్ ఫ్యాన్స్ గా ఆయన ను గెలిపిస్తామని వారు ప్రకటించారు.