వెంకయ్యకు ఇచ్చేందుకు నరేంద్ర మోడీ సమ్మతిస్తారా.?

modi

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎవరు.? అన్న ప్రశ్నకు నేడో రేపో సమాధానం దొరకనుంది. విపక్షాలైతే మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాని రంగంలోకి దించుతున్నాయి. దాదాపు 22 పార్టీల మద్దతు యశ్వంత్ సిన్హాకి వున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఎన్టీయే కూటమి తరఫున ఎవరు బరిలోకి దిగుతారన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అనూహ్యంగా రేసులోకి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు దూసుకొచ్చింది. బీజేపీ అధిష్టానం నుంచి జేపీ నడ్డా తదితరులు తాజాగా వెంకయ్యనాయుడుతో మంతనాలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

నిజానికి, వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి అయ్యేందుకు అన్ని అర్హతలూ వున్నాయి. ఆయన గతంలోనే రాష్ట్రపతి అయి వుండాల్సింది. అనూహ్యంగా ఆయన్ని ఉపరాష్ట్రపతి పదవికి పరిమితం చేసింది బీజేపీ. తద్వారా యాక్టివ్ రాజకీయాల నుంచి ఆయన్ని కావాలనే బీజేపీ తప్పించిందనే ఆరోపణలూ లేకపోలేదు.

వెంకయ్యనాయుడు అంటే రాజకీయాల్లో అజాత శతృవు. ఆయన అభ్యర్థిత్వాన్ని దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించే పరిస్థితి వుండదు. పైగా, తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీల నుంచి కూడా వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వానికి రాష్ట్రపతి ఎన్నికల్లో సానుకూలత లభిస్తుంది.

అయితే, ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు ఎలా వున్నాయన్నదే కీలకం ఇక్కడ. గతంలో వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి పదవికి పరిమితం చేసింది కూడా నరేంద్ర మోడీనే. సో, రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడికి ప్రమోషన్ అనేది, నరేంద్ర మోడీ చేతుల్లో వుందన్నది బహిరంగ రహస్యం.