తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ కూడా రాకుండానే బీజేపీ చేస్తోన్న హడావుడి ఇప్పటికే ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోసేలా ఉంది.ఈ ఓవర్ యాక్షన్‌తో ముందే సెల్ఫ్ గోల్ వేసుకోబోతోందా ? అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.ఏపీలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ఇప్పటికే బీజేపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు.ఇక పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏపీలో జరుగుతోన్న పెద్ద ఎన్నిక కావడంతో బీజేపీ సత్తా ఏంటో ఈ ఎన్నికతోనే తేలిపోనుంది.ఈ ఎన్నికలో నిలబడి సత్తా చాటుదామనుకుంటున్న జనసేన పార్టీని సైలెంట్ గా పడుకో పెట్టేసింది. పొత్తు అనే ముసుగు కప్పి జనసేనని తన వెనుక తిప్పుకుంటుంది.
కానీ అమరావతి, పోలవరం విషయంలో ఏపీ ప్రజలు బీజేపీ చేసిన మోసంతో ఆ పార్టీపై తీవ్ర కోపంతో రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో అసలు గెలుపు సంగతి పక్కన పెడితే తిరుపతిలో బీజేపీ డిపాజిట్ అయినా తెచ్చుకుంటుందా ? అన్నదే ఇప్పుడు సస్పెన్స్.ఆ పార్టీకి అంతకు మించి ఇక్కడ ఆశించడానికేం లేదన్నది కూడా వాస్తవమే.హిందు దేవాలయాలకు నిధులు ఇవ్వాలి, దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలనడం వరకు బీజేపీకి ప్లస్సే అయినా దర్గాలకు, చర్చిలకు నిధులు ఇస్తే మాత్రం బీజేపీ కడుపు మంటతో రగిలిపోవడం చాలా వర్గాలకు మింగుడు పడడం లేదు.ఏదేమైనా బీజేపీ మితిమీరి హిందూత్వ అజెండాతో ముందుకు వెళితే బొక్క బోర్లా పడక తప్పదు. తిరుపతి ఉప ఎన్నిక బీజేపీ పార్టీ కి చావో రేవో అన్నట్లుగా మారింది.