Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ మీడియా సమావేశంలో భాగంగా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన విషయాలతో పాటు తన అన్నయ్య నాగబాబుకు మంత్రి పదవి కల్పించడం గురించి కూడా మీడియా వారు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా నాగబాబుకు త్వరలోనే మంత్రిగా పదవి ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి మీడియా వారు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు.
మీ పార్టీలో ఎంతోమంది కీలక నేతలు ఉన్నారు. వారందరినీ కాదని ఏ హోదాతో మీ అన్నయ్య నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నారు అంటూ మీడియా వారు ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ అర్హత ఉందని తన పార్టీలో వారికి మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. ఇదే ప్రశ్న మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? ఆయనను ఎందుకు అడగరు? నన్నే ఎందుకు కార్నర్ చేస్తున్నారు? అని పవన్ కల్యాణ్ ఎదురు ప్రశ్నించారు.
మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తిరిగి వారినే పవన్ ప్రశ్నించడంతో రిపోర్టర్ సైతం మౌనంగా ఉన్నారు. తన వ్యవహారానికి వస్తే.. పనితీరు, పార్టీ పట్ల అంకిత భావంతోపాటు.. సామర్థ్యాన్ని కూడా అంచనా వేసుకుని మంత్రిపదవులు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఇప్పటికే తన పార్టీకి చెందిన కందుల దుర్గేష్ అలాగే నాదెండ్ల మనోహర్ కి కూడా మంత్రి పదవి ఇచ్చినట్లు పవన్ గుర్తు చేశారు.
ఇక పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ జగన్ మోహన్ రెడ్డి కులమతాలకు అతీతంగా మంత్రి పదవులు కేటాయించారు అదేవిధంగా ఎన్నికలలో పోటీ చేసే ప్రజలు ఎన్నుకున్న వారికి మాత్రమే ఆయన మంత్రి పదవులు ఇచ్చారు తప్ప ఇలా అడ్డదారిలో వచ్చిన వారికి ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించి అనంతరం మంత్రి పదవులను కేటాయించలేదు అంటూ కౌంటర్ ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.
