తెలంగాణలో జనసేన ఎందుకు పోటీ చేయడం లేదో తెలుసా?

# పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పోటీ.

తెలంగాణలో జనసేన పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదనేదాని ఎన్నోరకాల వూహాగానాలు వినవస్తున్నాయి. కెసియార్ కు సాయం చేసేందుకే పోటీ చేయడం లేదని కొొందరు, తెలంగాణలో పోటీ చేసే ధైర్యం లేదని కొందరు ఇలా ఏవేవో రాశారు,రాస్తున్నారు. దీని మీద జనసేనాని సింపుల్ గా వివరణ ఇచ్చారు. 

 

తెలంగాణ రాష్ట్రంలో నిర్దేశిత కాలపరిమితిలో ఎన్నికలు జరిగినట్లయితే జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఒక ప్రణాళికను రూపొందించుకున్నాము. అయితే ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేనకు ఈ ఎన్నికల బరిలో నిలవడం ఒక్కింత కష్టతరంగా భావించాము. తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే జనసేన లక్ష్యం. తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగింది. శాసనసభ ఎన్నికలకు కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగనున్న రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమాయత్తం అవుతుందని తెలంగాణ ప్రజలకు వినయపూర్వకంగా తెలియచేస్తున్నాను. -జైహింద్.