పవన్ ను వెంటాడుతున్న వాలంటీర్లు… బదులివ్వలేని ఘాటైన లేఖ రాశారు?

పవన్ కు విమర్శలు చేయడం మాత్రమే వచ్చు.. కానీ, ఆ విమర్శలకు ప్రతి విమర్శలు చేసినా, ఛాలెంజ్ లు చేసినా తిరిగి స్పందించారు. పలాయనం చిత్తగిస్తారు. అని రాజకీయ వర్గాల్లో ఒక నానుడి ఉంది. ఈ విషయంలో లోకేష్ తో పవన్ పోటీ పడుతుంటారని అంటుంటారు.

ఆ సంగతి అలా ఉంటే… వారాహి యాత్ర పేరుచెప్పి పవన్ చేస్తున్న రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా పవన్ పై తూర్పు గోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం రెండు లేఖాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బకు మళ్లీ జనసేనాని కాని, జనసేన నేతలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఆ పేరెత్తే సాహసం చేయలేదు!

ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చే సరికి వాలంటీర్లపై అవాకులూ చెవాకులూ పేలారు పవన్! వ్య్యక్తులపై దాడి చేస్తే వారు తిరిగి దాడిచేయడం మొదలుపెడితేనే తట్టుకోలేక పారిపోయే పేరు సంపాదించుకున్న పవన్… వాలంటీర్ల వంటి బలమైన వ్యవస్తపై దాడికి దిగారు! దీంతో రాష్ట్రవ్యాప్త నిరసనలతో పాటు పవన్ కు ఒక లేఖ రాశారు మహిళా వాలంటీర్లు.

అవును… పవన్ పై పది ప్రశ్నలు సంధిస్తూ ఒక లేఖాస్త్రం వదిలారు రాష్ట్రంలోని మహిళా వాలంటీర్లు. ఈ సందర్భంగా ఎన్ని విడాకులు అయినా ఇచ్చుకో కానీ… విలువలకు మాత్రం విడాకులు ఇవ్వకు అంటూ స్మూత్ గా ఇచ్చిపడేశారు!

ఈ సందర్భంగా వాలంటీర్లు పవన్ పై సంధించిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి…

వాలంటీర్లు అంటే బైక్ లకు సైలెన్సర్లు పీకి రయ్ రయ్ మంటూ దూసుకుపోయే రౌడీ బ్యాచ్ అనుకున్నావా?

వాలంటీర్లు అంటే సినిమా థియేటర్లలో స్క్రీన్లు చింపి, కుర్చీలు విరగొట్టి నిప్పుపెట్టే బ్యాచ్ అనుకున్నావా?

వాలంటీర్లు అంటే మిగతా హీరోల ఆడియో ఫంక్షన్లలో పవన్ పవన్ అంటూ రచ్చ చేసే బ్యాచ్ అనుకున్నావా?

వాలంటీర్లు అంటే పక్క హీరోల సినిమాలు రిలీజైన రోజే ఫ్లాప్ ఫ్లాప్ అంటూ తప్పుడు ప్రచారం చేసే బ్యాచ్ అనుకున్నావా?

వాలంటీర్లు అంటే మహిళలన్న గౌరవం లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే బ్యాచ్ అనుకున్నావా?

వాలంటీర్లు అంటే రేణు దేశాయ్ ను కూడా గౌరవం లేకుండా అవమానించే చిల్లర బ్యాచ్ అనుకున్నావా?

వాలంటీర్లు అంటే ఎయిర్ పోర్టుల్లో మంత్రులపై కర్రలతో, రాళ్లతో దాడులు చేసే గూండా బ్యాచ్ అనుకున్నావా?

వాలంటీర్లు అంటే బాగున్న రోడ్లు తవ్వేసి.. దాని ముందు సెల్ఫీలు దిగే అల్లాటప్పా బ్యాచ్ అనుకున్నావా?

వాలంటీర్లు అంటే నీ పేరు చెప్పి వృద్ధుల దగ్గర సంతకాలు పెట్టించుకుని ఆస్తులు కొట్టేసే బ్యాచ్ అనుకున్నావా?

వాలంటీర్లు అంటే ప్యాకేజీ కోసం నువ్వు ఎత్తుకోమన్న ప్రతి జెండాను భుజానికెత్తుకునే బానిస బ్యాచ్ అనుకున్నావా?