పవన్ కళ్యాణ్  వీరాభిమాని ఆత్మహత్య

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడలోని టవాకర్ జిమ్ ట్రైనర్ అనిల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవన్ కళ్యాణ్ కి అనిల్ కుమార్ వీరాభీమాని. గత కొద్ది రోజులుగా అనిల్ కుమార్ అసంతృప్తితో ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోవాలని అనిల్ ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇంతలోనే అనిల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

పవన్ అభిమాని అనిల్ కుమార్

చనిపోయే ముందు అనిల్ పవన్ కు లేఖ రాశారు. ఇంత వరకు పవన్ కళ్యాణ్ ను దగ్గర నుంచి చూడలేదని నా అభిమాని, నా అన్నయ్య, నా కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య నన్ను చూడటానికి రావాలి, తన చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించాలని లేఖలో అనిల్ రాశాడు. తాను చనిపోయే ముందు అనిల్  పవన్ కళ్యాణ్ కి రాసిన లేఖ కింద ఉంది చూడండి.

విజయవాడకు చెందిన అనిల్ కుమార్ జిమ్ ట్రైనర్. తనే ఒక జిమ్ సెంటర్ ను నడుపుతున్నాడు. పవన్ కళ్యాణ్ ను అనేక సార్లు కలవాలని ప్రయత్నించాడు. జనసేన పార్టీ ఆవిర్భావం తరువాత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉంటున్నాడు. పవన్ తన అంత్యక్రియలకు రావాలని లేఖలో అనిల్ కోరాడు. అనిల్ ఆత్మహత్యతో విజయవాడలో విషాదం నెలకొంది.