‘బాయ్యలోకెల్లా అతి పెద్ద బాయ్య.. వాడి పేరు చింతకాయ! ఈ కొజ్జా రికార్డింగ్ డాన్సర్‌గాడు.. తాగేది మందు.. దూరేది సందు.. చెప్పేది శ్రీరంగ నీతులా? ఈ అడ్డగాడిద మత్తు అడ్డంగా దింపేసే టైమ్ దగ్గర పడింది..’ ఇదండీ వైసీపీ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) విజయసాయిరెడ్డి తాజా ట్వీట్.
అంతకు ముందు ‘కుక్క రోడ్డు మీద మొరుగుతుంది.. వీడు కెమెరా ముందు మొరుగుతాడు. కుక్క గంజి తాగుతుంది.. వీడు గంజాయి తాగుతాడు. కుక్క – వీడు ఒకటే తింటారు.. ఇలాంటి వెధవ నోటి నుంచి మాటలు ఎలా వస్తాయి.?8 అంటూ ట్వీటేశారు విజయసాయిరెడ్డి.
ఇంకాస్త వెనక్కి వెళితే, ‘ఓరినీ అయ్య..న్న! నిన్ను సృష్టించేటప్పుడే దేవుడు నీకు అన్నం తినేది కింద, అశుద్ధం పేగు పైన పెట్టాడు. కాబట్టే నువ్వు ఏం మాట్లాడినా నీ కంపు నోటి నిండా పెంట పెంటే!’ అంటూ ఇంకో ట్వీట్ కనిపిస్తుంది విజయసాయిరెడ్డి అధికారిక అకౌంట్‌లో.
ఈ ట్వీట్ల వల్ల ప్రయోజనమేంటి.? అంటే, రాజకీయ నాయకులు మీడియా మైకుల ముందు కూడా ఇలాగే మాట్లాడితే దాని వల్ల ప్రయోజనమేంటి.? అని ప్రశ్నించాల్సి వస్తుంది.
స్థాయిని దిగజార్చేసుకోవడం.. అనేది పాత మాట. ఆ దిగజారిపోవడంలోనూ కొత్త లోతుల్ని కనుగొంటున్నారు రాజకీయ నాయకులు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడూ తన స్థాయిని ఏనాడో దిగజార్చేసుకున్నారు. ముఖ్యమంత్రిని ‘చెత్త నా డాష్..’ అని అయ్యన్న విమర్శించిన సంగతి తెలిసిందే.
అయ్యన్నను గట్టిగానే విజయసాయి కెలికేశారు. మరి, అయ్యన్న నుంచి వచ్చే ట్వీటోత్పాతమెలా వుంటుందో.!