వాలంటీర్ల విషయంలో పవన్ స్థాయి పూర్తిగా పడిపోయిందని.. పవన్ కల్యాణ్ మరీ దిగజారిపోయారని.. ఆధారాలు లేకుండా నిస్సిగ్గుగా బురదజల్లారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పవన్ కంటే తాను ఇంకా ఎక్కువగా దిగజారగలనని అంటున్నట్లుగా ముందుకు వచ్చారు అనిత!
పవన్ కల్యాణే దిగజారిపోయి మాట్లాడారు అనుకుంటే, అంతకు మించి దిగజారగలనన్నట్లుగా దిగడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఇందులో భాగంగా… పింఛన్ ఇవ్వాలంటే తమ వద్ద పడుకోవాలని వాలంటీర్లు అడుగుతున్నారని అనిత సంచలన ఆరోపణ చేశారు.
అవును… “వాలంటీర్ల గురించి నేను పచ్చిగా చెబుతా. పింఛన్ కావాలంటే నా దగ్గర పడుకుంటావా? అని అడుగుతున్నారు. ఆఖరికి ఇంటి స్థలం కావాలంటే నాకేంటని అడుగుతున్నారు” అని అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అనితను వాయించి వదులుతున్నారు నెటిజన్లు.
ఈ సందర్భంగా తాము కూడా పచ్చిగా మాట్లాడ్తామంటూ నెటిజన్లు కీలక ప్రశ్నలు తెరపైకి తేవడం గమనార్హం. వాటిలో ప్రధానంగా… టీడీపీలో ఎమ్మెల్యే లేదా మరేదైనా పార్టీ పదవి ఇవ్వాలంటే ఎలాంటి “కమిట్మెంట్” అడుగుతున్నారో మీరు చెబుతారా అనితా.. లేక, మేము చెప్పాలా? అని నెటిజన్లు నిలదీస్తున్నారని తెలుస్తుంది.
ఇదే సమయంలో… టీడీపీలో మహిళలపై సాగుతున్న లైంగిక వేధింపుల గురించి, ఆ పార్టీని వీడిన పలువురు నాయకురాళ్లు చెప్పిన విషయాల్ని ఈ సందర్భంగా తెరపైకి తెస్తున్నారు. అదేవిధంగా… టీడీపీలో మహిళలు రాణించాలంటే ఎలా వ్యవహరించాలో ఒక్కసారి దివ్యవాణి, సాధినేని యామినీ శర్మ, కృష్ణవేణి తదితరులను అడిగితే అనితతో పాటు ఆ పార్టీ నాయకుల బాగోతాలన్నీ కథలుకథలుగా చెబుతారనే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తుంది.
అదే విధంగా… పింఛన్ తీసుకునే మహిళల వయసు 60కి పైబడి వుంటుందని, వాలంటీర్లకు 25 నుంచి 35 ఏళ్ల లోపు ఊంటాయని, పైగా వాలంటీర్లలో 60% మహిళలే అని.. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అనిత నోటికొచ్చినట్టు మాట్లాడ్డం ఆమెకే చెల్లిందని చీవాట్లు పెడుతున్నారట నెటిజన్లు.
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా అనిత వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడుతున్నారంట నెటిజన్లు. దీంతో… పవన్ కంటే తాను బాగా దిగజారగలనని అనిత పరోక్షంగా చెప్పినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు.