ప‌శువుల డాక్ట‌ర్ – శిశువుల డాక్టర్… మధ్యలో చంద్రబాబు!

ప్రస్తుతం ఏపీలో తీవ్రస్థాయిలో విమర్శలు అంటే… అది చంద్రబాబు – లోకేష్ .. కొడాలి నాని – వల్లభనేని వంశీల మధ్యే అని చెప్పాల్సిన పరిస్థితి. టీడీపీలో ఎవరు నోరుజారినా.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా.. తమ టార్గెట్ బాబు అని, వెంటనే చినబాబు – చంద్రబాబులకు తలంటడం ఖాయమని చెబుతున్నారు నాని – వంశీ ద్వయం!

అయితే తాజాగా వల్లభనేని వంశీ.. చంద్రబాబుపై ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అటు వైకాపా – ఇటు టీడీపీ కేడర్ లలో ఇదే హాట్ హాట్ టాపిక్! ప్రస్తుతం ఏపీలో గన్నవరం ఇష్యూ కంటిన్యూ అవుతున్న తరుణంలో… గ‌న్న‌వ‌రం వెళ్లిన చంద్ర‌బాబు జ‌గ‌న్‌ తో పాటు వైసీపీ నేత‌ల్ని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. దీంతో మైకందుకున్న వంశీ.. తనమార్కు సెటైర్స్ తో బాబుని విమర్శించడంతో పాటు.. “శిశువుల డాక్టర్” అని ఒక డైలాగ్ వదిలారు!

అవును… తన‌ను ప‌శువుల డాక్ట‌ర్‌ గా వెట‌కార ధోర‌ణిలో చంద్రబాబు విమర్శిస్తున్నారని మొదలుపెట్టిన వంశీ.. తిరుప‌తిలో చంద్ర‌బాబు.. శిశువుల డాక్ట‌ర్‌ ని మోస‌గించిన క‌థ చెప్పాల‌ని కొంద‌రు త‌న‌ను అడుగుతున్నార‌ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ క‌థ చెబితే మ‌ళ్లీ వెక్కివెక్కి ఏడ్చే పరిస్థితి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దీంతో… “ఎవరబ్బా బాబు చేతిలో మోసపోయిన ఆ శిశువుల డాక్టర్?” అని తెగ ఆలోచించేస్తున్నారంట తమ్ముళ్లు! మరి ఈ విషయాన్ని ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు అయినా వంశీ చెబుతారా? లేక అలా సస్పెన్స్ లోనే ఉంచుతారా అన్నది వేచి చూడాలి!

YouTube video player