ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు సృష్టిస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఈ స్కాం చుట్టూనే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా అన్నట్లుగా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంటరయ్యారు.
ఈ క్రమంలో స్కిల్ స్కామ్ కేసులోకి సడెన్ గా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. స్వతహాగా లాయర్ కూడా అయిన ఉండవల్లి అరుణ్ కుమార్.. ఆర్థిక వ్యవహారాలపైనా సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తిగా జనంలో గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి చిట్స్ లో అక్రమాలపై ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న విషయం తెలిసిందే.
ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుదే కీలక పాత్ర అంటున్న నేపథ్యంలో ఇది హైప్రొఫైల్ కేసు అని ఆయన చెబుతున్నారు. ఇదే అస్మయంలో ఈ కేసును మరింత సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని కూడ్దా ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇలా అనేక అంశాలతో సంక్లిష్టంగా ఉన్న ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు.
అవును… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్ని కోరుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్… హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్ కి ఇంకా నంబర్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో… ఉండవల్లి పిటిషన్ పై హైకోర్టు స్పందించి.. సీబీఐ విచారణకు ఆదేశిస్తే మాత్రం బాబుకు పూర్తిస్థాయిలో కష్టాలు తప్పనే కామెంట్లు వినిపిస్తున్నాయి.