డికె అరుణ సమక్షంలో టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి

మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ సమక్షంలో పలువురు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గార్లపాడు మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, భీంపురం గ్రామా నాయకులు 50 మంది కాంగ్రెస్ లో చేరినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా డికె అరుణ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనను చూసి ప్రజలు విసిగిపోయారన్నారు. తెలంగాణలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని అన్నారు. ఏ గ్రామంలో డబుల్ బెడ్రూం లు ఇవ్వడం లేదన్నారు. ఇంటింటికి ఉద్యోగం చెప్పి ప్రజలను మోసం చేసిన పార్టీ టిఆర్ఎస్ అన్నారు. తెలంగాణ లో రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానం లో ఉందని అన్నారు. అవినీతి రెండో స్థానం లో ఉందని విమర్శించారు.

గడిచిన నాలుగేళ్ల పాటు రైతాంగాన్ని విస్మరించిన కెసిఆర్ సర్కార్, ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో రైతులు ఎక్కడ ఓటమి పాలు  చేస్తారని  భయంతో రైతులకు ఎకరాకు 4వేలు ఇస్తున్నాడని అన్నారు. అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచిన తరువాత ఎన్నికలకు ఏడాది ముందు అమలు చేస్తామనడం తెరాస దమన నీతికి అద్దం పడుతోందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి రాష్ట్రంలో తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. పార్టీలో చేరిన వారిలో గార్ల పాడు  మాజీ  ఎంపీటీసీ ఆంజనేయులు ,భిం పురం గ్రామా నాయకులు జి. హనుమంతు, రాజు, గోకారి,గోవిందు ,గోపాల్ తదితరులు ఉన్నారు.