టిఆర్ ఎస్ భారీ స్కెచ్, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద వల

 కాంగ్రెస్ మీద చావు దెబ్బ వేసేందుకు టిఆర్ ఎస్  సిద్ధమవుతూ ఉంది.  అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ను తుడిచి పెట్టడం సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టిఆర్ ఎస్ లో విలీనం కావడంతో కౌన్సిల్ ఈ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. మహమ్మద్ షబ్బీర్ అలీకి ప్రతిపక్ష హోదా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇపుడు అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాకుండా ఉండేందుకు చర్యలు మొదలుపెట్టారు. దీనికోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద వల పన్నారని తెలిసింది. దాదాపు పది పన్నెండు మంది ఎమ్మెల్యేలతో  టిఆర్ ఎస్ కాంటాక్ట్ లో ఉందని విశ్వసనీయ సమాచారం. ఇందులో కనీసం ఎనిమిది మంది  దారికొస్తారని పార్టీ భావిస్తున్నది. వీరిలో కొందరికి మంత్రి పదవులు మరికొందరికి ఇతర లాభసాటి ప్రయోజనాలు  ఆశచూపుతున్నారని భోగట్టా. 

119 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా ఉండాలంటే కనీసం 12 మంది (పదో వంతు) సభ్యులుండాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాలు గెలుపొందింది. దీనికోసం ఎనిమిది మందిని లాగేసే స్కెచ్ వేసిందని రాజకీయవర్గాల్లో చర్చ మొదలయింది.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 17 లోక్ సభ స్థానాలలో కనీసం 16 గెల్చుకుంటామని టిఆర్ ఎస్ నేతులు చెబుతున్నారు . వాళ్ల ధైర్యానికి కారణం ఉంది. ఇపుడు 5 లోక్ సభ నియోజకవర్గాలలో అంటే నిజామాబాద్,మహబూబ్ నగర్, కరీంనగర్,హైదరాబాద్, సికిందరాబాద్ లలో కాంగ్రెస్ కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోొలేదు. ఆదిలాబాద్, మల్కాజ్ గిరి, మెదక్, నాగర్ కర్నూల్, జహీరాబాద్, పెద్ద పల్లి, వరంగల్, నల్గొండ లోక్ సభ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క సీటు గెల్చుకుంది. కాంగ్రెస్ ఓదార్పు లభించింది మిగత చోట్ల నుంచే. అందులో ఛేవెళ్ల, భువనగిరి నుంచి రెండేసి,ఖమ్మం నుంచి మూడు, మహబూబాబాద్ నుంచి నాలుగు అసెంబ్లీ సీట్లు గెల్చుకుంది. టిడిపిలో ఇద్దరు ఎ మ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ లోని 12 మంది ఎమ్మెల్యే మీద టిఆర్ ఎస్ ఎక్కు పెట్టినట్లు తెలిసింది. ఈ సారి పార్టీ ఫిరాయింపు చట్టం భారిన పడకుండా ఉండేందుకు లేజిస్లేచర్ పార్టీలో చీలిక , టిఆర్ ఎస్ లో విలీనం స్ట్రాటజీ ఫాలో అవుతున్నది. కౌన్సిల్ ఈ పధ్దతిలోనే నలుగు ఎమ్మెల్సీలు సేఫ్ గా టిఆర్ ఎస్ లో విలీనమయ్యారు.

ఇదే పద్ధతిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వస్తే పార్టీ చీలిపోతుంది. చీలిక వర్గం టిఆర్ ఎస్ విలీనం అవుతుందని టిఆర్ ఎస్ నాయకత్వానికి సన్నిహితంగా ఉన్నవారు బాహాటంగా చెబుతున్నారు.