టిఆర్ఎస్ మందా జగన్నాథం.. ఇదేమి భాష అబ్బా? (ఆడియో)

ఆయన వెనుకబడ్డ పాలమూరు జిల్లాలోనే పేరుమోసిన పెద్ద లీడరు. అప్పట్లో టిడిపిలో సుదీర్ఘ కాలం పాలమూరుకు సేవలందించారు. డాక్టర్ చదివిన వ్యక్తి కావడంతో మందా జగన్నాథం ను చంద్రబాబు బాగా ప్రోత్సహించారు. తర్వాత వైఎస్ కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం పెరగడంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. పార్లమెంటులో జరిగిన ఒక వివాదాస్పద బిల్లుపై ఓటింగ్ లో టిడిపిలో ఉంటూనే వైఎస్ మీద అభిమానంతో కాంగ్రెస్ కు ఓటేశారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారానే వెనుకబడిన పాలమూరుకు సేవలందించారు. అనంతరం ఆయన మనసు తెలంగాణ మీదకు మళ్లింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోశించారు. పాలమూరులో తిరుగులేని నాయకుడు అనిపించుకుంటున్నవేళ ఆయనను నాగర్ కర్నూలులో ప్రజలు ఓడించారు. అంతేకాదు ఆయన కుమారుడిని సైతం అలంపూర్ ప్రజలు ఓడించారు. దీంతో ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్తానానికి కొద్దిగా బ్రేక్ పడింది. తర్వాత బంగారు తెలంగాణలో భాగంగా ఆయనకు ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టారు కేసిఆర్.

ఇదంతా ఇలా ఉంటే మందా జగన్నాథం ఒక మీడియా రిపోర్టర్ మీద చిందులు తొక్కారు. బూతు మాటలతో, గబ్బు, గదరు, గలీజు పదజాలంతో రిపోర్టర్ ను  తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టేశారు. ఒక లీడర్ మాట్లాడకూడని భాషలో మాట్లాడారు. ఒక జర్నలిస్టును పట్టుకుని అనకూడని మాటలు అన్నారు. గోపాలకృష్ణ అనే మీడియా ప్రతినిథిని బండబూతులు తిట్టారు. ఇదంతా ఎందుకంటే మందా జగన్నాథం టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి పోతున్నారని ఒక జర్నలిస్టు వార్త రాశారు. దీంతో మందా కు ఎనలేని ఆగ్రహం వచ్చి నిగ్రహం కోల్పోయి గల్లీ లీడర్ కంటే గలీజు భాషను, ముత్క పదాలతో విరుచుకుపడ్డారు. మందా జగన్నాథం పై విజయ క్రాంతి అనే పత్రికలో అచ్చైన ఆర్టికల్ కింద ఉంది. అలాగే ఆయన బూతుపురాణం ఎలా సాగిందో.. కింద ఆడియో ఉంది వినండి.

manda jagannatham bad language