చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు.. విలన్ ను చివరకు హీరోను చేస్తున్నారా?

chandrababu-naidu-reuters-1139326-1661445251

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురుకావడం హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు పర్యటనకు అనుమతులు లేవనే కారణం చూపుతూ పోలీసులు ఈ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రచార రథాన్ని పోలీసులు సీల్ చేశారు. నోటీసులు తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించడం గమనార్హం.

ఆ తర్వాత చంద్రబాబు నోటీసులు ఎందుకు ఇస్తున్నారో రాతపూర్వకంగా చెప్పాలని పోలీసులను కోరారు. సొంత నియోజకవర్గంలో పర్యటించే స్వేచ్ఛ కూడా లేదా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబు కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ విధంగా అడ్డుకోవడం ద్వారా చంద్రబాబును హీరోను చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు కల్పించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఈ విధంగా వ్యవహరించడం వల్ల టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు సైతం జగన్ విషయంలో ఇదే విధంగా ముందుకెళ్లే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబును, పవన్ ను అడ్డుకోవడం వల్ల సాధారణ ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

జగన్ సర్కార్ వల్లే పోలీసులు చంద్రబాబు పర్యటనల విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇతర పార్టీల విషయంలో మరీ కఠినంగా వ్యవహరించడం వల్ల వైసీపీ భవిష్యత్తులో తీవ్రస్థాయిలో నష్టపోయే ఛాన్స్ అయితే ఉంది.