ఏపీ బీజేపీ నేతలు సమయం వచ్చిన ప్రతి సందర్భంలో వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. అయితే విశాఖలో జరిగే మోదీ సభ కోసం బీజేపీ, వైసీపీ కలిసి పని చేస్తున్నాయి. బీజేపీ జనసేన మధ్య దోస్తీ లేకపోవడంతో బీజేపీ వైసీపీ మధ్య దోస్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. పవన్ బీజేపీకి వెన్నుపోటు పొడిచాడని బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీన జరిగే మోదీ పర్యటనకు పవన్ కు ఆహ్వానం కూడా అందలేదని సమాచారం.
పవన్ కు ఆహ్వానం అందినా వైసీపీతో బీజేపీ దోస్తీ వల్ల పవన్ ఈ సభకు హాజరు కావడం లేదని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తును అధికారికంగా ప్రకటిస్తె బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ టీడీపీతో పొత్తు గురించి సైలెంట్ గా ఉన్నంత మాత్రాన ఆయనకు, ఆయన పార్టీకి ప్రత్యేకంగా కలిగే బెనిఫిట్స్ అయితే ఉండవని చెప్పవచ్చు. మరోవైపు పవన్ ఆటిట్యూడ్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కూడా సినిమా హీరోలా బిహేవ్ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. కారు టాపెక్కి పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఎక్కువమంది ఈ వీడియో గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ వింత చేష్టలను సాధారణ ప్రజలు సైతం తప్పుబడుతున్నారు.
పవన్ కళ్యాణ్ తన తప్పులను తెలుసుకోకపోతే కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో నష్టపోతారు అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి కావచ్చని అయితే ఈ తరహా పనుల వల్ల పవన్ స్థాయి తగ్గుతుందే తప్ప పెరగదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. విమర్శలను పట్టించుకోకుండా పవన్ ముందడుగులు వేస్తే పవన్ పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని చెప్పవచ్చు.