కేసీఆర్ వైపు ఏపీ నేతలు చూస్తున్నారా.. ఆయన మాస్టర్ ప్లాన్ ఇదేనంటూ?

KCR (1)

ఏ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు అయినా ఇతర పార్టీలలో కీలకంగా ఉండే రాజకీయ నేతలను ఆకర్షించే విషయంలో ముందువరసలో ఉంటాయి. ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం ద్వారా మన పార్టీ బలోపేతం కావడంతో పాటు అవతలి పార్టీలు బలహీనపడతాయి. ఏపీలో బీ.ఆర్.ఎస్ పార్టీ అభివృద్ధి దిశగా కేసీఆర్ అడుగులు వేస్తుండగా తాజాగా ఏపీ రాజకీయ నేతలు పార్టీలో చేరనున్నట్టు ప్రకటలు వెలువడ్డాయి.

ఏపీలో నిజంగా పాలించే సత్తా ఉన్న నేతలెవరూ లేకపోతే మాత్రమే ఏపీ నేతలు కేసీఆర్ పై దృష్టి పెట్టే అవకాశం ఉంది. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ల రూపంలో ఏపీ నేతలకు ఎన్నో బెస్ట్ ఆప్షన్లు ఉండగా కేసీఆర్ వైపు వాళ్లు చూడాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ నియమించగా ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

ఏపీలో బీ.ఆర్.ఎస్ అధికారంలోకి రావాలంటే మొదట కేసీఆర్ ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఏపీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేసీఆర్ ఏం చేస్తారో చెప్పాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ మధ్య సమస్యలను ఏ విధంగా కేసీఆర్ పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. ఏపీ ప్రజల మనస్సు గెలుచుకోవడానికి కేసీఆర్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

ఏపీ రాజకీయాల్లో సక్సెస్ సాధించాలంటే కేసీఆర్ కొన్ని త్యాగాలు చేయక తప్పదు. అలా త్యాగాలు చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దూరం కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే ఛాన్స్ అయితే ఉంది. ఏపీ రాజకీయాల్లో సక్సెస్ సాధించడానికి కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళతారో తెలియాల్సి ఉంది.