చంద్రబాబు జాతకం అస్సలు బాలేదా.. ఏం చేసినా రివర్స్ అవుతోందిగా?

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి జాతకం ప్రస్తుతం అస్సలు బాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఏం చేసినా అందుకు రివర్స్ లో జరుగుతుండటం గమనార్హం. 2024 ఎన్నికల కోసం జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావించారు. అయితే 15 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు జనసేనకు ఇస్తామని టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినా ఆ ఆఫర్ పై పవన్ అస్సలు ఆసక్తి చూపలేదు.

టీడీపీ ఆఫర్ వల్ల టీడీపీతో పొత్తు పెట్టుకోనని పవన్ కళ్యాణ్ పరోక్షంగా వెల్లడించారు. మరోవైపు గోరంట్ల మాధవ్ వివాదాన్ని పెద్దది చేయడానికి చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. అయితే ఈ ప్రయత్నాల వల్ల రెండు కులాల మధ్య గొడవలు జరిగి మధ్యలో టీడీపీ పరువే పోయింది. మరోవైపు గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటూ టీడీపీ చేసిన హడావిడి అంతాఇంతా కాదు.

అయితే ఈ రిపోర్ట్ విషయంలో టీడీపీదే తప్పని చివరికి ప్రూవ్ అయింది. మరోవైపు చంద్రబాబు అనుకూల పత్రికలో అమిత్ షా తనను కచ్చితంగా కలుస్తారనే విధంగా రాయించుకున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే అటు రామోజీరావును ఇటు ఎన్టీఆర్ ను కలిసిన అమిత్ షా చంద్రబాబును మాత్రం పట్టించుకోలేదు. అమిత్ షా చంద్రబాబును రాబోయే రోజుల్లో కూడా నమ్మే పరిస్థితి లేదని తేలిపోయింది.

మరోవైపు కుప్పంలో సైతం చంద్రబాబుకు అనుకూల పరిస్థితులు లేవు. లోకేశ్ వల్ల టీడీపీకి నష్టమే తప్ప ఏ మాత్రం లాభాం లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రూవ్ అయింది. చంద్రబాబు ఎంత కష్టపడుతున్నా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు, నేతలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.