ఈ దెబ్బతో పొత్తులో బీజేపీ మీద జనసేనదే పైచేయి ?

Janasena shock to Rapaka Varaprasad 

ఏపీలో పంచాయతీ ఎన్నికలు హీట్ పెంచాయి. గ్రామాల్లో పోటీ హోరా హోరీగా ఉంటున్నాయి.. ఎలాగైనా గెలుపు దక్కించుకోవాలనే పట్టుదలతో పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలైన జనసేన పార్టీ ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతూ… ఉనికి చాటుకుంది. పశ్చిమలోని 5 నియోజకవర్గాల్లో పలు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగరేశారు. పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఆచంటలలో.. పలు పంచాయతీలను జనసేన కైవసం చేసుకుంది.

The Janasena party proved its stamina in the panchayat elections
The Janasena party proved its stamina in the panchayat elections

తూర్పులో కాకినాడ రూరల్‌ , పెద్దాపురం, జగ్గంపేట.. రాజమండ్రి రూరల్, కొత్తపేట, రామచంద్రపురం, రాజనగరం, తణుకు నిడదవోలులో సత్తా చాటింది. ఇక, కృష్ణా జిల్లాలో మూడో దశకొచ్చాక పుంజుకున్న జనసేన… అవనిగడ్డ, పెడన, మచిలీపట్నంలో సీట్లు సాధించింది. తెనాలి డివిజన్‌లోనూ మంచి సీట్లు గెలిచింది. కడపలోని రైల్వే కోడూరుతో పాటు ఒకటి రెండు చోట్ల ప్రభావం చూపింది. మొత్తంగా 300 సర్పంచ్‌లు వచ్చాయని జనసేన అంచనా వేస్తోంది.

ఈ ఎన్నికల్లో ఎక్కడా.. బీజేపీతో జనసేనకు సర్దుబాటు లేదు. అక్కడక్కడ టీడీపీతో దోస్తీ కట్టింది. అయినా.. అనుకున్న దానికంటే మంచి ఫలితాలు సాధించింది. ఈ ఎన్నికల్లో ఎక్కడా బీజేపీ ఊసే కనిపించలేదు. అసలు ఆ పార్టీ అధిష్టానం పట్టించుకోనే లేదు. బీజేపీకి రాష్ట్రం మొత్తమ్మీద పట్టుమని 10 పంచాయతీలు కూడా దక్కలేదు. అయితే, ముందు నుంచీ దృష్టి పెట్టక పోయినా.. గ్రామాల్లో సత్తా చాటింది జనసేన. ఈస్ట్‌, వెస్ట్‌లలో జెండా ఎగరేసింది. పలు వార్డుల్లోనూ విజయం సాధించింది. ఈ ఫలితాలు చూశాక… బీజేపీ కంటే జనసేనే బెటర్‌ అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.