దటీజ్ కొడాలి నాని

దటీజ్ కొడాలి నాని అనిపించుకున్నారు. సెటైర్లు వేయటంలోను, ప్రత్యర్ధులపై ఎంత ఘాటుగా స్పందిస్తారో అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డిపై ఎంతటి అభిమానం ఉందో ప్రత్యేకంగా ఇపుడు చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఎల్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పై తనకు ఎంత అభిమానం ఉందో స్పష్టం చేశారు.

సదరు మీడియా ఇంటర్వ్యూలో పౌరసరఫరాల శాఖకు చెందిన అనేక విషయాలు మాట్లాడారు. ఆ సందర్భంగా చివరలో వేసిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తు జగన్ ఆదేశిస్తే తక్షణమే తన మంత్రిపదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. తనకు పదవులకన్నా పార్టీనే ఎక్కువగా తన ప్రాధాన్యతను వివరించారు.

పదవిని వదులుకోమని ముఖ్యమంత్రి ఆదేశిస్తే చాలు వెంటనే ఏమీ ఏమీ ఆలోచించకుండా రాజీనామా చేసేస్తానన్నారు. తనకు పార్టీ పటిష్టత కోసం పనిచేయటమే ముఖ్యమన్నారు. రాష్ట్రంలో వైసిపిని తిరుగులేని శక్తిగా బలోపేతం చేయటమే తన లక్ష్యమన్నారు.