Pithapuram: పిఠాపురంలో ఆగని ఆధిపత్య ఫైటింగ్

కాదేది కవిత కనరహం అని శ్రీశ్రీ అంటే కాదేది కొట్లాడుకోవడానికి అనర్హం అంటున్నారు పిఠాపురం నియోజకవర్గంలోని కూటమి నేతలు. తమ అధిపత్యాన్ని చాటుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్ని వారు విడిచిపెట్టట్లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడే ఈ ఆదిపత్య ఫైటింగ్ మొదలైంది. పవన్ కోసం కూటమి పొత్తు ధర్మంలో భాగంగా తన సీటును వదులుకోవడానికి మాజీ ఎమ్మెల్యే వర్మ అయిష్టంగానే ఓకే చెప్పారు. పేరుకే అక్కడ పవన్ ఎమ్మెల్యే గాని భవిష్యత్తులో పెత్తనం అంతా నీదేనని, సీనియర్ గా నీ సూచనలు అభిప్రాయాలకు అనుగుణంగానే అక్కడ పాలన జరుగుతుందని వర్మను అప్పట్లో చంద్రబాబు బుజ్జగించారు. పైగా భవిష్యత్తులో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని, రాష్ట్రస్థాయిలో పదవుల పంపకంలో క్షత్రియ కోటాలో మంచి అవకాశాలు కల్పిస్తానని నమ్మబలికారు. దీంతో వర్మ తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు.

ఎన్నికల్లో గెలిచిన పవన్ ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గం వైపు లుక్ వేయడం మానేశారు. దీన్ని అలుసుగా తీసుకున్న వర్మ నియోజకవర్గ రాజకీయాలని తనదైన శైలిలో చక్కబెట్టేస్తున్నారు. అధికార పార్టీ సీనియర్ నాయకుడిగా, మాజీ ఎమ్మెల్యేగా అధికారులతో తనకున్న సంబంధాలను ఉపయోగించి పిఠాపురంలో చక్రం తిప్పేస్తున్నారు. ఇదిగో ఇక్కడే జనసేన నాయకులు ఒళ్ళు మండుతోంది.

టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల జనసేన నాయకులకు ఎలాగూ సీన్ ఉండటం లేదు. తమ పార్టీ అధినేత గెలిచిన పిఠాపురంలోనైనా తమకు పెత్తనం లేకపోతే ఎలాగని జనసేన నాయకులు ఫైర్ అవుతున్నారు. దేవస్థానాల పాలక మండళ్లు, వివిధ అధికారుల నియామకాల్లో తో పార్టీకి ప్రాధాన్య ఇవ్వాలంటే తమ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి నాయకులు కుమ్ములా డుకుంటున్నారు. అందుకే అప్పట్లో కేడర్ ను సంతృప్తి పరచడానికి నాగబాబు స్వయంగా పిఠాపురం వచ్చి ఒక ఎస్సై నియామకంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

తాజాగా పాదగయ్య క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పెత్తనం తమదంటే తమదని టిడిపి, జనసేన నేతలు కుమ్ములాడుకుంటున్నారు. షరా మామూలుగానే గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో తాము గెలిచాము కాబట్టి శివరాత్రి ఉత్సవాలపై పెత్తనం తమకే దాకాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. కాదు తమ మద్దతుతోనే గెలిచారు కాబట్టి తమకే ఆధిపత్యం ఇవ్వాలని టిడిపి నేతలు కోరుతున్నారు. కాకినాడ జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన పిఠాపురం పాదగయలో ఈనెల 24న మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమౌతాయి. లక్షల్లో తరలివచ్చే భక్తుల కోసం వివిధ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది బారీకేడ్ల కు, పారిశుధ్య పనులకు, విద్యుత్ దీపాలంకరణలకు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లకు టెండర్లు పిలుస్తారు.

టెండర్లలో ఈ పనులు దక్కించుకున్న వారు స్థానిక నాయకులకు భారీగా ముడుపులు సమర్పించుకుంటారు. సరిగ్గా ఇదిగో ఈ ముడుపుల కోసమే టిడిపి జనసేన నాయకులు స్ట్రీట్ ఫైటింగ్ లకు దిగుతున్నారు. ఇలా శివరాత్రి ఉత్సవాల్లో తమ పెత్తనం కోసం తీవ్రమైన ఒత్తిడి తె స్తుండడంతో అధికారులు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది . దీన్ని సాకుగా చూపి అధికారులతో కమిటీ వేయాలని దేవాదాయ శాఖ భావిస్తుండగా తమ పార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని జనసేన, టిడిపి నాయకులు పంతాలకు పోతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఇప్పటికీ కనీసం 8సార్లు కూడా పవన్ కళ్యాణ్ తమ నియోజకవర్గానికి రాలేదని ఆ పార్టీ నాయకులే నిరుత్సాహ పడుతున్నారు. తమ నాయకుడు అప్పుడప్పుడు అయినా ఇక్కడికి వస్తుంటే పార్టీ నేతలుగా తమ మాటను కూడా అధికారులు వింటారని, పవన్ నియోజవర్గాన్ని పట్టించుకోకపోవడం వల్లే టీడీపీ నాయకుల ముఖ్యంగా వర్మ పెత్తనం ఇక్కడ పెరిగిపోతోందని జనసేన కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. జనం కోసం రాకపోతే పోయెను కనీసం పార్టీ క్యాడర్ కోసం అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం వైపు ఒక లుక్కేస్తారా? ఈ స్ట్రీట్ ఫైట్లకు ఫుల్ స్టాప్ పెడతారా?.. చూద్దాం.

బ్రహ్మాస్త్ర లో ప్రభాస్.. ఆయనే పవర్ ఫుల్ అస్త్రం ఇదే | Prabhas Movie Latest Update | Telugu Rajyam