పృథ్వి గుట్టు విప్పిన శ్రీరెడ్డి. షాకింగ్ విషయాలు వెల్లడి

టాలీవుడ్, కోలివుడ్ సెన్సేషన్ శ్రీరెడ్డి ఈసారి పృథ్విపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అతని పొలిటికల్ ఎంట్రీ గురించి పోస్టు పెట్టి ౩౦ ఇయర్స్ ఇండస్ట్రీని చెడుగుడు ఆడేసుకుంది. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన వైసీపీ అధినేత జగన్ ని ఎమ్మెల్యే టికెట్ కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి అతనిపై నివ్వెరపోయే కామెంట్స్ చేసింది.

కామెడీ పృథ్వి..నీ గోకుడు యవ్వారాలు హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 లో తెలియవా? లేక అమెరికా ఈవెంట్స్ కి వచ్చిన అమ్మాయిలకి తెలియవా? ఎమ్మెల్యే టికెట్ కావాలంట ముసలి నక్కకి. గురివింద గింజ డ్యాష్ డ్యాష్( బూతులు) పెట్టుకోరా అంటూ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు పెటింది.