సోము వీర్రాజు ఒట్టి చేతుల్తో వస్తే సీన్ మారిపోతుంది 

Somu Veerraju should do his best in Delhi
కేంద్ర బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర బీజేపీని ఇరుకునపడేస్తున్నాయి.  కేవలం ఆంధ్రా విషయంలోనే ఇలా జరుగతోంది.  అవతల తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర శాఖకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు బాగా కలిసొస్తున్నాయి.  ఆంధ్రా శాఖ మాత్రమే అబాసుపాలవుతోంది.  అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర నాయకుల్ని ఎంత లేపాలి చూసినా చివరకు అది బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది.  రాజధాని అమరావతికి రాష్ట్ర శాఖను మద్దతివ్వమని చేప్పే మోడీ, అమిత్ షాలు కేంద్రంలో మాత్రం మూడు రాజధానములకు అనుకూలంగా జగన్ సర్కార్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్ధిస్తారు.  ఈ ధోరణి జనాలను బాగ్ అర్థమైపోయింది.  అందుకే రాజధాని విషయంలో మాత్రం బీజేపీ ఏం చెప్పినా నమ్మనక్కర్లేదు అంటున్నారు. 
 
Somu Veerraju should do his best in Delhi
Somu Veerraju should do his best in Delhi
పోలవరం విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది.  ఇక్కడేమో బీజేపీ నేతలు పోలవరం రావాల్సిందే అంటారు.  పైనుంచి నిధులేమో రావు.  అంచనా వ్యయాన్ని సగానికి కుదించి ఇస్తామంటారు.  ఈ అంశంలోనూ రాష్ట్ర బీజేపీ నాయకులు డమ్మీలే అయ్యారు.  ఇక తాజాగా తెరమీదకు వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదమూ ఇంతే.  నష్టాల్లో ఉందనే సాకు చెప్పి మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకానికి పెట్టేశారు.  అమ్మకంలో కేంద్రం చోపుతున్న చొరవ చూస్తే తెగనమ్మడం ఖాయంగా కనిపిస్తోంది.  నిజానికి స్టీల్ ప్లాంట్ కు ఉన్న ఆస్తులతో పోలిస్తే అప్పులనేవి పెద్ద విషయమే కాదు.  అనుకుంటే కొన్నేళ్లలోనే లాభాల్లోకి తెచ్చుకోవచ్చు.  కానీ కేంద్రం మాత్రం పెట్టుబడుల ఉపసంహరణల్లో భాగంగా పూర్తిగా అమ్మేయడానికి రెడీ అయింది. 
 
మొదటి నుండి కేంద్రం తీరు ఇలానే ఉంది.  లాభాల్లో ఉన్న బ్యాంకులనే  అమ్మకానికి పెడుతున్నారు.   అలాంటిది నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను వదులుతారని ఎలా అనుకోగలం.  ఈ విషయంలోనే కేంద్రం తీరు మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఉద్దేశ్యపూర్వకంగానే అమ్మకానికి పెట్టారని రాజకీయ పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి.  అడ్డుకోమని రాష్ట్ర బీజేపీ శాఖ మీద ఒత్తిడి తెస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు అమిత్ షాను కలవడానికి ఢిల్లీ వెళ్తున్నారు.  అమ్మకానికి వీల్లేదని చెప్పడానికి వెళ్తున్నట్టు మీడియా ముందు అన్నారు.  మరి ఇంత ఠీవీగా వెళ్తున్న ఆయన రాజధాని, పోలవరం మాదిరిగానే  ఒట్టి చేతుల్తో తిరిగొచ్చి తమ చేతుల్లో ఏమీ లేదని, అంతా కేంద్రం నిర్ణయమని చెబితే మాత్రం దెబ్బతినడం ఖాయం.