నోటి దూల నేత అరెస్ట్… అంతలోనే వదిలినా మేటర్ సీరియస్!

టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విశాఖకు విమానంలో రాగానే కృష్ణా జిల్లా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని.. ఎయిర్‌ పోర్టు నుంచి తీసుకెళ్లారు. దాంతో అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేశారంటూ టీడీపీ అధినేత నుంచి పార్టీ నాయకుల వరకు మీడియాలో విమర్శలు మొదలుపెట్టారు.

అయితే అయితేయలమంచిలి వద్ద అయ్యన్నపాత్రుడికి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు. అప్పటికే చంద్రబాబు పోలీసులకు తనదైన శైలిలో వార్నింగ్ కూడా ఇచ్చేశారు. జగన్‌ మాటలు విని పోలీసులు హద్దులు మీరితే.. తగిన మూల్యం చెల్లించుకుంటారని చమ్రబాబు పోలీసులను హెచ్చరించారు.

కాగా… ఇటీవల గన్నవరంలో జరిగిన లోకేష్‌ యువగళం సభలో చింతకాయల అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ను నోటికొచ్చినట్టు తిట్టారు.

ముఖ్యమంత్రిని ఉద్దేశించి శృతిమించిన విమర్శలు చేశారు. ఇందులో భాగంగా… సైకో గాడికి సమాధి కడుతాం, వాడో పెద్ద గజ దొంగ, ఆర్థిక ఉగ్రవాది అంటూ తిట్టారు. “రేయ్‌ జగన్‌” అంటూ దూషించారు. “ఈ పనికిమాలిన నాకొడుకా మనకు ముఖ్యమంత్రి” అంటూ నోరు పారేసుకున్నారు.

ఇదే సమయంలో… టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజాపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజాను పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా తాము కోరితే “నా సొగసు చూడు మామ” అంటోంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేకప్ తీస్తే పగలే దడుచుకుంటాం అంటూ కించపరిచారు.

ఈ అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని ఆత్కూరు పోలీస్ స్టేషన్‌ లో ఇది వరకే ఫిర్యాదు చేశారు. దాంతో అయ్యన్నపాత్రుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో అయ్యన్నపాత్రుడితో పాటు బుద్దా వెంకన్నపైనా పేర్నినాని ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలోనూ అయ్యన్నపాత్రుడిని విశాఖ ఎయిర్‌ పోర్టు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు… 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు.

ఆ సంగతి అలా ఉంటే… ఏడు ప‌దుల వ‌య‌సుకు చేరువ అవుతున్న ఈ సీనియ‌ర్ నేత టీడీపీకి అధికారం దూరం అయిన‌ప్పటి నుండి నోటీకి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. అది ఫ్యాషన్ అనుకుంటున్నాడో.. లేక, తల్లితండ్రుల పెంపకంలో లోపమో తెలియదు కానీ… ప్రభుత్వ ఉద్యోగులు.. మంత్రులు.. ముఖ్యమంత్రి అనీ తేడా లేకుండా నోటీకి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడు!

#@AK News World టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్