సీనియర్ జర్నలిస్ట్ పాంచజన్య మృతి

విజయవాడ, నవంబర్ 28: ఆంధ్ర పత్రిక,మహానగర్  ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ పాంచజన్య ఇక లేరు. పాంచజన్య గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం శ్యాస కోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నగరంలో ని ఒక హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలు విజయవాడలో జరగుతాయి.

మహానగర్ పత్రికను ఎప్పటినుంచో నడుపుతున్న పాంచజన్య తీ ఏడాది ఎపుడో మూత పడిన ఆంధ్రపత్రికను పున: ప్రారంభించారు. శివలెంక రాధాకృష్ణ  నుంచి అనుమతి తీసుకుని ఈ పత్రికను గత ఏడాది జూలైలో ప్రారంభించారు. ఈ పత్రికను ఒక స్థాయికి తీసుకురాక ముందే ఆయన చనిపోయారు.

పాంచజన్య మృతి వార్త తెలుసుకున్న ఐజేయు.ఏపీయుడబ్ల్యూజే నాయకులు ఆయన పార్ధీవ దేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించి ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంతాపాన్ని తెలియజేసిన వారిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, ఏపీయుడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, , కొండా రాజేశ్వరరావు,విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మరాజు చలపతిరావు, అర్ వసంత్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, చిన్న పత్రికల సంఘం నాయకులు సిహెచ్ రమణారెడ్డి, ఫోటో జర్నలిస్ట్ సంఘం నాయకులు యన్.సాంబశివరావు, వల్లభదాసు మాధవరావు ,మరియు పెద్దసంఖ్యలో పాత్రికేయులు ఉన్నారు.

హాస్పిటల్ వద్ద నుండి జర్నలిస్ట్ లు అందరూ అంతిమ యాత్రగా బయలు దేరి కుటుంబ సభ్యులు ద్వారా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధనలు చేశారు..

రాజకీయ నాయకుల సంతాపం
పాంచజన్య మృతి వార్త తెలుసుకున్న బి.జె. పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ నాయకులు వంగవీటి రాధా  ఆయన పార్ధీవ దేహాన్ని సందర్శించి వారి అకాల మృతికి సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.