బిజెపి నుంచే పోటి చేస్తా… అక్బరుద్దీన్ ను ఓడగొడుతా

ఓయూలో చదువుతున్న ముస్లిం విద్యార్ధిని సయ్యద్ షహజాది ఎన్నికల పోరుకు సిద్దమయ్యారు. చాంద్రాయణ గుట్టలో అక్బరుద్దిన్ ని ఓడించడమే తన లక్ష్యమని, నాలుగు సార్లు గెలిచిన అక్బరుద్దీన్ ఓవైసి చాంద్రాయణ గుట్టలో ఏం ఉద్దరించారని షహజాది ప్రశ్నించారు. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసి బరిలో దిగుతుండగా బిజెపి నుంచి షహజాది రంగంలోకి దిగుతున్నారు. ఇంతకీ ఎవరీ షహజాది, అక్బరుద్దీన్ ను ఎందుకు ఓడించాలనుకుంటున్నారో తెలియాలంటే కొండ లాంటి అక్బరుద్దీన్ ని ఢికొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు. ఆమెకున్న కెపాసిటీస్ ఏమిటి ఈ స్టోరీ చదవాల్సిందే.

సయ్యద్ షహజాది.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముస్లిం విద్యార్దిని . ఓయూలో 2014 లో ఎం. ఏ పాలిటిక్స్ పూర్తిచేశారు.  ప్రస్తుతం కోఠి పిజి కాలేజిలో ఎం ఏ హిందీ చేస్తున్నారు. 2009 లో తాను పదో తరగతి ఉన్నప్పటి నుంచే ఏబీవిపి లో చురుకుగా వ్యవహరించింది. ముస్లింలకు ముస్లింలు ప్రాధాన్యత వహిస్తున్న ప్రాంతాలలోనే అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

ఎంఐఎం నాయకులు పాతబస్తీలో తమకు ఎదురు లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని వాళ్లే ముస్లింల ఇంక వేరే వారు కాదా అని ఆమె ప్రశ్నించారు. వారు పెద్ద తోపుళ్లా వ్యవహరిస్తున్నారని వారి కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప వేరే ముస్లిం కులాలు బాగుపడ్డ దాఖలాలు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరే ఎంఐఎం నాయకులా రాజకీయం చేసేది అని ఆమె విమర్శించారు.

బిజెపి పార్టీ హిందూ మతతత్వ పార్టీ అని ముద్ర వేశారు కానీ బిజెపి లౌకిక వాదం ప్రదర్శించే పార్టీ అని షహజాది అన్నారు. ఈ దేశానికి ఒక ముస్లిం వ్యక్తిని రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపిదే అన్నారు. ముస్లింలను బిజెపి ఏనాడు ఓటు బ్యాంకు తో చూడలేదని ముస్లింలను గౌరవించేది బిజెపి పార్టీనే అని షహజాది అన్నారు.

 

పాతబస్తీలో ముస్లిం అమ్మాయిలను దుబాయ్ షేకులకు అమ్ముతుంటే చేతకాని వారిలా చూస్తూ ఊరుకున్నారే కానీ అడ్డుకున్నరా అని  ఆమె ఎంఐఎం పార్టీ పై షహజాది అన్నారు.  ఆడపిల్లలను అంగట్లో పెట్టి అమ్ముతుంటే ఎంఐఎం నాయకులు ఏం చేశారని ఆమె నిలదీశారు.  పాతబస్తీలో అసలు వారికి ఓట్లు అడిగే హక్కే లేదన్నారు. ఇన్నేళ్లలో పాతబస్లీకి బ్యాంకులు తెప్పించ చేతకానీ వారు ఇంకా పరిపాలిస్తారా అని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

సిగ్గులేకుండా ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించింది అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. 3 నెలలు సంసారం చేసిన తర్వాత కూడా వారికి నచ్చకుంటే అప్పుడు విడాకులు తీసుకోవచ్చని దానికి ఒక విధానం ఉందని కానీ దానిని అడ్డుపెట్టుకొని ఫోన్లలో, వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్ లు చెప్పి ముస్లిం మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు.

చాంద్రాయణ గుట్లలో రోడ్లు లేవు, నీటి సౌకర్యం లేదు, డ్రైనేజి వ్యవస్థ సరిగా లేదు. అనేక కుటుంబాలు గాజులు అమ్ముకొని బతుకుతున్నాయి కానీ ఏ ఒక్కరైనా ఉన్నత స్థాయిలో ఉన్నాయోమో అక్బరుద్దీన్ చెప్పాలి. కేవలం తమ రాజకీయ స్వార్దం కోసం, తమ ఎదుగుదల కోసం వేలాది ముస్లిం కుటుంబాలను ఆగం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం ప్రజలు వాస్తవాన్ని గమనించి ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. ఓవైసి కుటుంబాలు లేకపోతే ముస్లింలు బతకలేరా అని ఆమె ప్రశ్నించారు.  

బిజెపి పార్టీ నుంచి తనకు అవకాశం ఇచ్చి తనను గెలిపిస్తే పాతబస్తీ రూపురేఖలు మారుస్తాన్నారు.  ప్రధాన మంత్రి గారిని తీసుకొచ్చి బ్యాంకులు పెట్టించడంతో పాటు సంవత్సర కాలంలోనే పూర్తి స్థాయి మార్పులు తీసుకొస్తానన్నారు. బిజెపి లక్ష్మణ్ గారి ఆశీస్సులతో తప్పక గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తంచేశారు. అమ్మాయిల అక్రమ రవాణాను ఆపడం, ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్దంగా కాకుండా చూడటం, అభివృద్ది చేయడమే తన ముందున్న లక్ష్యాలని ఆమె తెలిపారు.  ఇదంతా ఆమె ఒక టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.