సానియా మీర్జాకు కొడుకు పుట్టాడు

ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల జంటకు కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని తెలుపుతూ షోయబ్ మాలిక్ ట్వీట్ చేశాడు. మా ప్రపంచంలోకి అబ్బాయి పుట్టాడు. తాను తండ్రినయ్యానంటూ ఆనందం వ్యక్తం చేశారు. అందరి ఆశీస్సులతో మీర్జామాలిక్, బేబి మీర్జా మాలిక్ క్షేమంగా ఉన్నారని షోయబ్ మాలిక్ తెలిపారు. సానియా మీర్జా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అబ్బాయికి జన్మనిచ్చినట్టు తెలుస్తోంది.  

సానియా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని, చాలా సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నామని షోయబ్ మాలిక్ తెలిపారు. 12 ఏప్రిల్ 2010 న సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల వివాహం జరిగింది. ఆ తర్వాత కూడా సానియా, మాలిక్ వారి కెరీర్ కోసం ఆటపైనే దృష్టి సారించారు. అబ్బాయి ఫోటోలను మాత్రం షోయబ్ మాలిక్ విడుదల చేయలేదు.  మాలిక్ చేసిన ట్వీట్ కింద ఉంది. 

Shoaib Malik 

@realshoaibmalik