షాకింగ్ : తెలుగుదేశం అభ్యర్థి కోసం సమంత ప్రచారం

అక్కినేని కోడలు సమంత తెలుగు దేశం పార్టీకి చెందిన అభ్యర్థికి మద్దతు ఇస్తూ ట్వీట్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. అతడికి ఓటు వేసి గెలిపించాలని కోరడం చర్చనీయాంశం అయింది. సమంత సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి ఆమె తన మద్దతు ప్రకటించారు. దీంతో కొందరు అభిమానులు ఆమెను ట్విట్టర్ ద్వారా… ఆయకు మీకు రిలేషన్ ఏమిటి? మీ ఫ్యామిలీ ఫ్రెండా? అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు.

నా కుటుంబ స్నేహితుడికి ఓటు వేయాలని కోరుతున్న సమంత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది సమంత ఒక పార్టీకి మద్దతు ఇస్తూ ప్రచారం చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆయనకు వ్యక్తిగతంగా సపోర్ట్ చేయడానికి కారణం ఏమిటి? అనేది హాట్ టాపిక్ అయింది.

‘అవును ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నేను వ్యక్తిగతంగా ఆయనకు మద్దతు ఇస్తున్నాను. ఆయన సోదరి డాక్టర్ మంజుల నాకు బాగా తెలుసు. నేను హైదరాబాద్‌కు మూవ్ అయినప్పటి నుంచి నాకు పరిచయం. మంచి వ్యక్తి కాబట్టే మద్దతు ఇస్తున్నాను’ అంటూ అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత రిప్లై ఇచ్చారు.