ముంబై :ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో అక్రమ గుట్కా రవాణకు పాల్పడుతున్న కొందరిని ఎపీ పోలీసులు పట్టుకొన్నారు. గుట్కా రవాణాపై నిషేధం ఉండటంతో నిందితులను ప్రశ్నించారు. దర్యాప్తులో భాగంగా అనుమానితులను విచారించగా హీరో సచిన్ పేరును బయటపెట్టారు. దాంతో ఆయనకు నోటీసులు జారీ చేయగా వాటిని పట్టించకోకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
ఇదిలా ఉండగా, సచిన్ జోషి గురించి నిందితుల వెల్లడించిన అంశాలను నిర్ధారించుకొన్న తర్వాత హైదరాబాద్‌కు చెందిన పోలీసు బృందం ముంబైకి వెళ్లింది. ముంబైలో సచిన్ ఆచూకీపై ఆరా తీసింది. ముంబైలోని చత్రపతి మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నిఘా పెట్టిన పోలీసులు ఆయనను అక్కడే అదుపులోకి తీసుకొన్నారు.
హైదరాబాద్ పోలీసులు వర్గాలు వెల్లడించిన ప్రకారం.. భారీ సంఖ్యలో గుట్కా బాక్సులు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ముందస్తు సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు గుట్కా బాక్సులు స్వాధీనం చేసుకొన్నారు. వాటి విలువ లక్షల రూపాయల్లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే సచిన్ విచారించిన తర్వాత బెయిల్‌పై విడుదల చేసినట్టు సమాచారం.
దేశంలో గుట్కా వ్యాపారంలో సచిన్ జోషి కుటుంబం ప్రసిద్ధి. గుట్కా కింగ్‌గా సచిన్ జోషి తండ్రిని అభివర్ణిస్తారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న గుట్కా అమ్మకాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో హైదరాబాద్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇక సచిన్ విషయానికి వస్తే “మౌనమేలనోయి”చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత “ఆషికి 2” రీమేక్ చేసి ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. పలు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు.