వరంగల్ కాంగ్రెస్ లో టికెట్ కోసం రౌడీ షీటర్ల ఫైట్ (వీడియో)

వరంగల్ కాంగ్రెస్ లో  టికెట్ల కోసం రౌడీషీటర్ల మధ్య ఫైట్ ఏర్పడింది. జంగా రాఘవరెడ్డి కంటే సీనియర్ రౌడి షీటర్ ను తానే అని సుధీర్ రెడ్డి ప్రకటించారు. పార్టీ కోసం ఉద్యమిస్తే అన్యాయంగా టిడిపి ప్రభుత్వం తనపై రౌడిషీటర్ ను ఓపెన్ చేసిందన్నారు. 

పాలకుర్తి కాంగ్రెస్ టికెట్ పై జంగా రాఘవరెడ్డి, సుధీర్ రెడ్డిల మధ్య తీవ్ర పోరు ఏర్పడింది. తనకే టికెట్ ఇవ్వాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. రౌడి షీటరే ప్రాతిపదిక తీసుకుంటే తానే సీనియర్ రౌడీషీటర్ ని అని తనకే టికెట్ ఇవ్వాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుధీర్ రెడ్డి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి. 

 

WARANGAL CONGRESS WAR