పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన వెనుక అసలు ఉద్దేశమేంటి ?

పవన్ కళ్యాణ్ మనస్తత్వమే పక్కవాడి కష్టంలో జోరబడి, ఆ కష్టంలో తనకూ భాగం ఉందని డప్పు కొట్టించుకుని తనని తాను ఒక నాయకుడిగా చిత్రీకరిచి చూపించుకోవటం, దీనికి గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నా తాజా ఉదాహరణ కడప ఉక్కు కర్మాగారం గురించి నేడు చేసిన వాఖ్యలు

రాయలసీమ పర్యటన అంటూ వచ్చి ఎప్పటిలాగే ముఖ్యమంత్రి జగన్ పైన తన అక్కస్సుని వెళ్లకక్కాడు పవన్ కళ్యాణ్, అందులో భాగంగా`ఇతను అన్న మాట “ఉక్కు కర్మాగారం పై ఎందుకు జగన్ మాట్లాడటం లేదు, జగన్ కి కడప ఉక్కు నిర్మాణంపై చిత్తశుద్ది లేదా?” అంటూ కోన్నిబండలు జగన్ పై వేసి వెళ్ళాడు, కానీ పవన్ చేసిన ఈ వాఖ్యల వేనక ఉన్న ఎత్తుగడ ఎంటి అంటే, ముందుగానే ప్రకటించినట్టు జగన్ గారు డిసెంబర్ 26న చేయబోయే కడప ఉక్కు కర్మాగార శంఖుస్థాపన రోజున ఇది జనసేన విజయం, పవన్ కళ్యాణ్ యాత్ర చేసి కడప ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడారో లేదో జగన్ తీవ్ర వత్తిడికి లోనై ఇలా శంఖుస్థాపన చేశారు ఇది పవన్ కళ్యాణ్ అంటే , ఇది జనసేన పవన్ ఆంటే అని డప్పు కొట్టుకుని, ఏదిగి ఏదగని బుద్దితో ఉన్న కుర్రకారులో తాను ఒక గొప్ప పోరాట యొధుడిగా చిత్రీకరించుకుని ఫ్రీగా క్రెడిట్ దోబ్బెయాలి అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ చేసిన ఒక స్టంట్ ఇది.

నిజానికి జగన్ గారు వై.యస్.ఆర్ జయంతి సందర్భంగా (జులై 8న) ఏర్పాటు చేసిన రైతు దినొత్సవ సభలో మాట్లాడుతూ కడప ఉక్కు కర్మాగారం రాబోయే డిసెంబర్ 26న శంఖుస్థాపన చెసి 3 ఏళ్ళలో పూర్తి చేసి ప్రత్యక్షంగా 20వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగం, పరోక్షంగా 50వేల మందికి ఉపాది కల్పిస్తాము అని చెప్పారు, – జగన్ గారు చెప్పిన డిసెంబర్ గడువు రానే వచ్చింది – ఆలస్యం చేయకుండా క్రెడిట్ కోసం పవన్ కూడా వచ్చేశాడు..

కె.ఆర్ సూర్య