ఎవర్రా నువ్వు ఇంత టేలెంటెడ్ గా ఉన్నావ్?

ఇటీవ‌ల ప్రముఖ ఆర్థిక నిపుణుడిగా జీవీ రావు నామధేయుడు ఒకే ఒక్క ఇంట‌ర్వ్యూతో పాపుల‌ర్ అయ్యారు. మ‌ళ్లీ జ‌గ‌న్ ప్రభుత్వమే వ‌స్తే ఆంధ్రప్రదేశ్… శ్రీలంక, పాకిస్థాన్ లా మారిపోతుందనే స్థాయిలో ఆయన చెప్పుకొచ్చారు. అదే విషయాన్ని “ఈనాడు” ప్రధానంగా అచ్చేసింది. అయితే ఈ కామెంట్లపై వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా ఈ ఆర్ధిక నిపుణుడు జీవీరావుపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ ఓ రేంజ్‌ లో ట్విట‌ర్ వేదిక‌గా సెటైర్స్ వేశారు. అనుబంధంగా.. ఒక ఛాలెంజ్ విసిరారు.

ఆ సంగతి అలా ఉంటే… ఈ సందర్భంగా జీవీ రావుపై విడుదలయిన ఒక వీడియో ని ఆర్జీవీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇది వైరల్ వీడియోగా మారిపోయింది. ఈ వీడియో గురించి వర్ణించే ముందు… ఆర్జీవీ ట్విట్ ఏమన్నారో ఒకసారి చూద్దాం.

“జీవీ రావు, నిన్ను ఫైనాన్సియల్ ఎక్స్ పర్ట్ గా గౌరవిస్తున్న 40 ఇయర్స్‌ కి నీ డాన్స్ టాలెంట్ తెల్సా? ఆయనకున్న ఫిలిం కాంటాక్ట్స్‌ తో నిన్ను జూనియర్ ఎన్ టీఆర్, మహేష్ బాబు, రాం చరణ్, ప్రభాస్ ల కంటే పెద్ద స్టార్ ని చేస్తారు. హే జీవీరావు నీకున్న డాన్స్ టాలెంట్‌లో ప‌ది శాతం దమ్మున్నా నా యూట్యూబ్ ఛానల్‌ లో ఏపీ ఫైనాన్స్ సిట్యుయేషన్ గురించి మాట్లాడటానికి ఇంటర్వ్యూకి రా” అని వేర్వేరు ట్వీట్లు చేశారు.

ఇప్పుడు వీడియో విషయానికొస్తే… ముందుగా ఈటీవీ న్యూస్ బిట్, అనంతరం రకరకాల వేరియేషన్స్ లో ఉన్న జీవీ రావు పిక్స్… అనంతరం.. “ఎవర్రా నువ్వు ఇంత టేలెంటెడ్ గా ఉనావ్” అనే సినిమా డైలాగ్. వెంటనే “నేను పుట్టాను.. ఈ లోకం చచ్చింది.. డోంట్ కేర్” అనే పాటకు చేతిలో కుక్కపిల్లను పట్టుకున్న జీవీరావు ఇచ్చిన తనదైన సిట్టింగ్ పెర్ఫార్మెన్స్. మళ్లీ… “ఎవర్రా నువ్వు…” డైలాగ్. నెక్స్ట్… “అన్నా మన కులపోడే అన్నా” అనే వీడియో బైట్. దానికి అనుబంధంగా చంద్రబాబు.. జీవీ రావుని సన్మానిస్తున్న ఫోటో… ఇలా విపరీతమైన క్రియేటివిటీతో రూపొందించబడిన ఈ వీడియో చూసి నవ్వనివారుంటారా అనేది ఆన్ లైన్ వేదికగా వినిపిస్తున్న ఒక ఛాలెంజ్.

ఏది ఏమైనా… గత కొంతకాలంగా అటు టీడీపీ, ఇటు జనసేన, అటు ఒక వర్గం మీడియాకు ఆర్జీవి పక్కలో బల్లెంలా మారిపోవడం గమనార్హం.