“ట్రూత్ ఫైనల్లీ స్పీక్స్”… బాబుపై ఆర్జీవీ ఘోరం!

గతకొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా రూపాంతరం చెందినట్లు కనిపిస్తున్న రాం గోపాల్ వర్మ… చంద్రబాబు & కోలను మామూలుగా టార్గెట్ చేయడం లేదు. జీ.హెచ్.ఎం.సీ. పరిధిలో ఒక బాలుడు కుక్కల దాడిలో మరణించిన విషయంపై ఇప్పటికీ ట్విట్టర్ లో తన పోరాటాన్ని కొనసాగిస్తున్న ఆర్జీవీ… అదే వేదికపై చంద్రబాబుపైనా, టీడీపీ నేతలపైనా తనదైన క్రియేటివిటీతో విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా… తాజాగా ఒక వీడియోని పోస్ట్ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఈ వీడియో హల్ చల్ చేస్తుంది.

గతంలో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన చంద్రబాబు వీడియోకు లిప్ సింక్ చేస్తూ… వెనక మిమిక్రీ చేయించి వదిలిన ఒక వీడియో అది. ఇందులో చంద్రబాబు తనను తాను దుర్మార్గుడిగా చెప్పుకుంటూ.. జగన్ ని గెలిపించుకుని, మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోమని ఏపీ ప్రజలకు అప్పీల్ చేస్తూ.. ఫైనల్ టచ్ ఇస్తారు!

“నమస్కారం. నేను మీ చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు మీకొక ముఖ్య విషయం చెప్పడానికొచ్చాను. 40ఏళ్ల నా రాజకీయ చరిత్రలో ఎన్నో చూశాను. ఎంతో చేశాను. ఇక రాజకీయాలకు శాస్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. నా నిర్ణయం కొందరికి బాదకలిగించినా.. చాలామందికి సంతోషకరమైన వార్తే. ఇక నాలాంటి రాజకీయాలు చేసే నాయకుడు ప్రపంచంలోనే లేడని నమ్మక తప్పని నిజం. ఎలాంటి కుత్రలూ కుతంత్రాలైనా.. నాతర్వాతే ఎవరైనా. అలా చేసిన పాపాలకు ఇప్పుడు మా పప్పు రూపంలో శిక్షనుభవిస్తున్నాను. ఇప్పుడు రాష్ట్రానికి మంచి నాయకత్వం అవసరం. అలాంటి నాయకుడు ప్రస్తుతం ఒకే ఒక్కడున్నాడు. ఈపాటికి ఆయనెవరో మీకు అర్ధమయ్యే ఉంటుంది. కాబట్టి ప్రజలంతా… అప్రమత్తంగా ఉండి, యువకుడు, ఉత్సాహవంతుడు, మాటతప్పని, మడమతిప్పని నేత, ప్రజల మనసులు గెలిచిన నాయకుడిని ఎన్నుకుని.. మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి. నమస్తే… సెలవు!”

ఇలా సాగింది రాం గోపాల్ వర్మ క్రియేటివిటి!