వద్దు మొర్రో ఈ రాజకీయాలు.. అని చిరంజీవి అంటున్నా, ఆయన్ని రాజకీయాలు వదలడంలేదు. ‘రాజకీయాల్ని నేను వద్దనుకున్నాను.. కానీ, నన్ను మాత్రం రాజకీయాలు వదలడంలేదు’ అని అర్థం వచ్చేలా, ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఓ డైలాగుంటుంది. ఆ డైలాగ్ కావాలనే రాయించారా.? అని చిరంజీవిని అడిగితే, ‘అది సన్నివేశానికి తగ్గట్టు రాసిందే తప్ప, నాకెలాంటి రాజకీయాలపైనా ఆసక్తి లేదు’ అని తేల్చేశారాయన.
కానీ, నిజంగానే చిరంజీవిని రాజకీయాలు వదలడంలేదు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ.. చిరంజీవిని రాజకీయాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తూనే వున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే చిరంజీవి రాజ్యసభకు ఎంపికయ్యారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు.
అయితే, ఈసారి పెద్ద ట్విస్ట్. కాంగ్రెస్ పార్టీ కూడా చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తోందిట. అదే సమయంలో బీజేపీ నుంచీ చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి మాత్రం, ఈ రెండు ఆఫర్లనీ సున్నితంగా తిరస్కరించారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజ్యసభ సీటుకి అంగీకరిస్తే, అది మళ్ళీ రాజకీయ అవార్డు అనే విమర్శలొస్తాయని చిరంజీవి ఆలోచిస్తుండొచ్చుగాక.!
కొన్నాళ్ళ క్రితమే ‘మా ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవి’ అని కాంగ్రెస్ నేత ఒకరు, ఏపీ రాజకీయాలకు సంబంధించి హాట్ కామెంట్స్ చేశారు. జనసైనికులు మాత్రం, చిరంజీవి జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.
రాజ్యసభ మాత్రమేనా.? మళ్ళీ కేంద్ర మంత్రి పదవి కూడానా.? కాంగ్రెస్, బీజేపీల నుంచి చిరంజీవికి వచ్చిన ఆఫర్స్ పూర్తి వివరాలేంటో.!