రైల్వేలో 1.30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రైల్వే శాఖలో కొలువుల జాతర వచ్చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో 1.3 లక్షల ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిని ఆర్ ఆర్ బీ, ఆర్ ఆర్ సీ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనిలో 30 వేల ఉద్యోగాలు నాన్ టెక్నికల్ కాగా లక్ష ఉద్యోగాలు లెవల్ 1 పరిధిలోనివి ఉన్నాయి.

నాన్ టెక్నికల్ పోస్టులకు ఫిబ్రవరి 28 నుంచి, పారా మెడికల్ స్టాఫ్ పోస్టులకు మార్చి 4 నుంచి , మినిస్టీరియల్ పోస్టులకు మార్చి 8 నుంచి, లెవల్ 1 పోస్టులకు మార్చి 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మొత్తం ఖాళీలు లక్షా ముప్పై వేలు

నాన్‌-టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ (ఎన్టీపీసీ)

  • జూనియ‌ర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌
  • ట్రెయిన్ క్లర్క్‌
  • క‌మ‌ర్షియ‌ల్ కమ్ టికెట్ క్లర్క్‌
  • ట్రాఫిక్ అసిస్టెంట్‌
  • గూడ్స్ గార్డ్‌
  • సీనియర్ క‌మ‌ర్షియ‌ల్ కమ్ టికెట్ క్లర్క్‌
  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
  • జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
  • కమర్షియల్ అప్రెంటిస్
  • స్టేష‌న్ మాస్టర్ త‌దిత‌ర పోస్టులు
  • పారా మెడిక‌ల్ స్టాఫ్‌..
  • స్టాఫ్ న‌ర్స్‌
  • హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్
  • ఫార్మసిస్ట్‌
  • ఈసీజీ టెక్నీషియ‌న్‌
  • ల్యాబ్ అసిస్టెంట్‌
  • ల్యాబ్ సూప‌రింటెండెంట్ తదితర పోస్టులు
  • మినిస్టీరియ‌ల్ అండ్ ఐసోలేటెడ్ కేట‌గిరీ..
  • స్టెనోగ్రాఫ‌ర్‌
  • చీఫ్ లా అసిస్టెంట్‌
  • జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్ (హిందీ) తదితర పోస్టులు

లెవల్ 1 పోస్టులు

  • ట్రాక్ మెయింటైన‌ర్‌ (గ్రేడ్-4)
  • హెల్పర్/అసిస్టెంట్ (టెక్నికల్)
  • గేట్‌మ్యాన్‌
  • అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్‌ తదితర పోస్టులు ఉన్నాయి.

పూర్తి వివరాలకు రైల్వే శాఖ వెబ్ సైట్ ను చూడండి.