ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎదురు ప్రశ్నించడమంటే నచ్చదు.
తనంత వాడు, పొలిటికల్ ఇండస్ట్రీ లో 40 యేళ్ల అనుభవంతో ఉన్నవాడు,దేశంలో సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ అయిన తాను ఏది చెప్పినా నమ్మాలంటాడు. నమ్మకపోతే తప్పు మీదే అంటాడు.
పోలవరం గురించి రాత్రికి రాత్రి లెక్కలు పెరిగితే అడగరాదు, రైతుల పోలవరం యాత్రకు వందల కోట్లు ఎలా ఖర్చయ్యాయని అడగరాదు, సింగపూర్ మాయాజాలం గురించి అడగరాదు, కట్టుబట్టలతో అమరావతి కొచ్చినపుడు ఇంతలగ్జరీగా స్పెషల్ ఫ్లయిట్స్ వేసుకుని ఈ ప్రపంచ యాత్రలేమిటని అడగరాదు. అడిగితే అమరావతిని అడ్డుకునేందుకు కుట్ర అని అరుస్తాడు. కేంద్రం నుంచి ఎంత నిధులొచ్చాయో ప్రజల ముందు పెట్టడు, అదేమిటని ప్రశ్నిస్తే, కట్టుబట్టలతో పంపించారు. కూర్చునేందకు కుర్చీలేదు. చెట్టు కింద సంసారం అంటూ పొంతన లేని విషయాలు ప్రస్తావిస్తాడు.
ఇలా, జనమంతా తాను చెప్పేదే కచ్చితంగా నమ్మితీరాలని ఆయన చెబుతున్న లెక్కల్లో ప్రధానమైంది అమరావతి. అమరావతి గ్రాఫిక్స్ కోసం, టెంపొరరీ అమరావతి నిర్మాణాల కోసం ఆయన నిధులను నీళ్లలాగా వెచ్చించి, నిధుల్లేవు, తెలంగాణ వాళ్లు తరిమేశారు, సెంటరోళ్లు పైసా ఇవ్వ లేదంటాడు. ఆయన గోలంతా అబద్దం అంటున్నాడు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్. ఇది నమ్మవద్దని తెలుగు ప్రజలకు చెబుతున్నాడు.
నిన్న విశాఖ పట్టణంలో మాట్లాడుతూ చంద్రబాబు లెక్కలమీద బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరాడు. క్యాపిటల్ నిర్మాణానికి ఇచ్చిన నిధుల మీద ఎక్కడయిన, ఎపుడయినా చర్చకు సిద్ధమన్నాడు.నేనయితే ఆయనను ఢిల్లీకి పిలుస్తున్నానన్నాడు.
‘ అమరావతి రాజధాని నిర్మాణానికి మొదటి సంంవత్సరంలోనిధులిచ్చేశాం. ఈ డబ్బులతో ఒక్క పర్మనెంట్ భవనం కూడా కట్ట లేదు. అయినా సరే, క్యాపిటల్ నిర్మాణానికి కేంద్రం నిధులివ్వడం లేదని బజారెక్కి అరుస్తున్నాడు. అమరావతి లో మేం ఇచ్చిన డబ్బులతో తాత్కాలిక భవనాలు కట్టించాడు. ఒకె. కట్టించాడు. తాత్కాలిక భవనాల నిర్మాణం చదరపు అడుగుకు ఎక్కడయినా రు 10 వేలు ఖర్చవుతాయా? తాత్కాలికంగా అట్టుకుంటున్నపుడు చదరపు అడుగు నిర్మాణానికి పదివేల రుపాయలు ఖర్చవుతాయంటే ఎవరు నమ్ముతారు. అందువల్ల కేంద్రం ఇచ్చిన నిధులేం చేశారో చంద్రబాబు ప్రభుత్వం లెక్కలు బయటపెట్టాలి,’ అని పీయూష్ గోయల్ అన్నారు.
కట్టేదే తాత్కాలిక భవనం. దానికి చదరపు అడుగుకు ఖర్చు రు. 10 వేలా… ఎవరైనా నమ్ముతారా?
పోలవరం ప్రాజక్టకు కూడా నిధులివ్వడం లేదని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్న విషయం ప్రస్తావిస్తూ, పోలవరం ప్రాజక్టును నేషనల్ ప్రాజక్టు గా ప్రకటించింది కేంద్రమే నని ఆయన గుర్తుంచుకోవాలనని పీయూష్ అన్నారు. పోలవరానికి ఇప్పటిదాకా ఇచ్చిన ఏడు వేల కోట్ల ఏమయ్యాయో కూడా చంద్రబాబు ప్రజల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
‘ఈ కాకి లెక్కల మీద బహిరంగ చర్చకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేను సవాల్ విసురుతున్నాను. ఈ విషయాలను చర్చించేందుకు ఆయన్నునేను ఢిల్లీ కి ఆహ్వానిస్తున్నాను. ప్రపంచంలోని నలుమూలలా ఉండే తెలుగు ప్రజలకు చంద్రబాబు లెక్కల మర్మం తెలియాలి,’ అని రైల్వే మంత్రి అన్నారు.
చంద్రబాబు మీద ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సొంత ఫామిలీ వ్యాపారంగా నడుపుతున్నాడు చంద్రబాబు. ఏప్రిల్ 11 తర్వాత ఈ ప్యామిలీ బిజినెస్ ను మూసేయాల్సిందే,’ అని పీయూష్ అన్నారు.