బాబుకు ఐటీ నోటీసులపై పురందేశ్వరి… ఏం సెప్తిరి ఏం సెప్తిరి!

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఐటీ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశంగా మారిన సంగతి తెలిసిందే. ఐటీ అధికారులు వరుసపెట్టి నోటీసులు జారీచేయడంతోపాటు.. ఆ నోటీసులు ఇవ్వడానికి గల కారణాలను సవివరంగా వివరించారు కూడా. అయితే తాజాగా ఈ విషయంపై పురందేశ్వరి స్పందించారు.

చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసుల వ్యవహారం చిన్నది కాదని.. రాజకీయ ఆరోపణలో లేక రెగ్యులర్ గా ఇచ్చే చిన్న చితకా నోటీసు కాదని అంటున్నారు! పైగా దుబాయ్ లో డబ్బులు తీసుకున్నారనే టాపిక్ కూడా తెరపైకి రావడంతో ఈడీ కూడా ఎంటరయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మరో వైపు దీనికి తోడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కూడా లింక్ అవ్వడంతో ఏపీ సీఐడీ కూడా ఎంటరవుతుంది.

అయితే ఇదేమీ పెద్ద విషయం కాదని అంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులపై పవన్‌ కల్యాణ్, పురందేశ్వరి, సీపీఐ రామకృష్ణ, నారాయణ అంతా కలుగుల్లో దూరిపోయారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో… ఈ విషయంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరారు.

దీంతో ఇంక తప్పించుకోవడం సాధ్యంకాదనుకున్నారో ఏమో కానీ… తొలుత స్పందించేందుకు ఆమె ఆసక్తి చూపని పురందేశ్వరి అనంతరం లైట్ గా స్పందించారు. ఇందులో భాగంగా ఐటీ నోటీసుల జారీ అన్నది ఒక సాధారణ పక్రియ అంటూ తేలికగా తీసేశారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలపై తాను స్పందించను అని చెప్పడం కొసమెరుపు!

దీంతో ఈ కామెంట్లపై వాయించి వదులుతున్నారు నెటిజన్లు. పురందేశ్వరి ఐటీ నోటీసులను సాధారణ పక్రియగా తీసుకునేవి కావని అంటున్నారు. ఇక్కడ నోటీసులు వచ్చింది ఏదో కంపెనీకి కాదని, అవి రాజకీయ ఆరోపణలు అసలే కాదని.. రికార్డుల్లో చూపని ఆదాయం గురించి అని గుర్తుచేస్తున్నారు.

ఒకటీ రెండూ కాదు ఏకంగా 118 కోట్ల రూపాయలు ముడుపులకు సంబంధించిన విషయం అని చెబుతున్నారు. 118 కోట్ల రూపాయల వ్యవహారం మీకూ మీ కుటుంబ సభ్యులకు చిన్న విషయమేమో కానీ.. ఐటీ శాఖకూ, ఏపీ ప్రజలకూ కాదని చురకలు వేస్తున్నారు.

ఆమె వ్యవహారం అలా ఉంటే… మరోవైపు బీజేపీ ఏపీ నేత విల్సన్ మాత్రం ఆధారాలు ఉంటే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనపై వస్తోన్న ఆరోపణలపై చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకునేలా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అంతేకానీ.. నోటీసులు ఇచ్చే పరిధి లేదు… నోటీసులు చెల్లవు అంటూ మాట్లాడడం సరికాదని సూచిస్తున్నారు.