టీడీపీ – జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 94 స్థానాల్లోనూ చంద్రబాబు తనతో పాటు తన కుమారుడు పోటీచేయబోయే స్థానాన్ని కన్ ఫాం చేస్తూ.. మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. మరోపక్క 24 స్థానాలు దక్కించుకున్న పవన్ మాత్రం ఐదు స్థానాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించారు. ఆ సంగతి అలా ఉంటే… ఆ ఐదు స్థానాల్లోనూ, ఆ ఐదుగురు అభ్యర్థుల్లోనూ పవన్ పేరు కానీ.. ఆయన పోటీ చేస్తారని చెబుతున్న భీమవరం పేరు కానీ ప్రస్థవనకు రాలేదు.
దీంతో.. భీమవరం విషయంలో పవన్ కు సర్వే ఫలితాలు ఏమైనా ప్రతికూలంగా వచ్చాయా.. లేక, భీమవరాన్ని జనసేనకు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించడం లేదా.. లేక, అంతకంటే బెటర్ ప్లేస్ పవన్ కు మరొకటి దొరికిందా.. ఇలా రకరకాల ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో… తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ఇప్పుడే ప్రకటించేస్తే.. జగన్ ఇప్పటినుంచే ఆ నియోజకవర్గంపై కాన్ సంట్రేషన్ చేసేస్తారని పవన్ ఆందోళన అని మరికొందరు వ్య్యాఖ్యానించడం మొదలుపెట్టారు.
దీంతో… భీమవరంలో పవన్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునే విషయంలో పునరాలోచనలో పడ్డారా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయలో భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు తాజాగా హైదరాబాద్ లో పవన్ తో భేటీ అయ్యారు. దీంతో భీమవరంలో సరికొత్త చర్చ మొదలైంది. ఇందులో భాగంగా ఈసారి భీమవరంలో పవన్ కాకుండా… మరోసారి అంజిబాబుని బరిలోకి తెస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైపోయింది.
అందుకు ఒక బలమైన కారణం ఉంది. గతంలో భీమవరం నుంచి అంజిబాబు వరుసగా రెండు సార్లు, రెండు వేరు వేరు పార్టీల నుంచి గెలుపొందారు. ఇక గత ఎన్నికల్లో భీమవరంలో టీడీపీ నుంచి పోటీ చేసి.. జనసేన అధినేత పవన్ కంటే ఎక్కువ ఓట్లు సాధించుకున్నారు. దీంతో… ఈ టిక్కెట్ కు తనకంటే అంజిబాబే సరైన అభ్యర్థి అనే టాపిక్ ఏమైనా పవన్ మదిలో మొదలైదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
2009 ఎన్నికల్లో భీమవరం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు అంజిబాబు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో టీడీపీ, పీఆర్పీలను దాటి కాంగ్రెస్ అభ్యర్థిగా అంజిబాబు గెలిచారు. ఇదే సమయంలో 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన… వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనుపై గెలిచారు. ఇలా రెండు వేరు వేరు పార్టీల నుంచి వరుసగా గెలిచిన చరిత్ర అంజిబాబుకి ఉంది.
ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీను చేతిలో ఓడినవారిలో అటు పవన్ తో పాటు టీడీపీ అభ్యర్థిగా అంజిబాబు ఉన్నారు. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అంజిబాబుకి 62,285 ఓట్లు దక్కగా.. ఇక మూడో స్థానానికి పరిమితమైన పవన్ కు 54,037 ఓట్లు దక్కాయి! ఈ నేపథ్యంలో టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అంజిబాబుని బరిలోకి దింపే అవకాశంపై చర్చ జరుగుతుందా అనే చర్చ ఇప్పుడు భీమవరంలో మొదలైందని తెలుస్తుంది.