ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతల పట్ల ప్రియాంక ఆందోళన

ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతల పట్ల ప్రియాంక ఆందోళన

మహిళల పట్ల ఉత్తర్రదేశ్ అనుసరిస్తున్న ధోరణి ఆందోళన కలిగిస్తున్నదని , శాంతి భద్రతలు కాపాడాల్చిన పోలీసులే అసభ్యంగా , అభ్యంతరకరంగా ప్రవర్తించడం తనను బాధించిందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విట్టర్లో తన నిరసన తెలిపారు . ఉత్తర్ ప్రదేశ్లో ఒక మహిళ, కొందరు యువకులు తనను వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్ కు వెడితే ఆమె పట్ల ఆ పోలీస్ స్టేషనులో వున్న అధికారులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం సిగ్గుతో తలా వంచుకునేలా ఉందని దానికి సంబందించిన ఒక వీడియో ను పోస్ట్ చేశారు . ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది .

ఉత్తర్ ప్రదేశ్లో ఒక మహిళ తన సోదరుడితో కలసి వెడుతుంటే వీధిలో వున్న యువకులు ఆమెను చూసి కామెంట్స్ చెయ్యడం మొదలు పెట్టారు . దానికి అభ్యంతరం తెలిపిన అతన్ని చితక బాదారు . ఈ విషయాన్ని ఆ మహిళ ఫిర్యాదు చెయ్యడానికి వస్తే పోలీసులు ఆమెను ఇబ్బంది పెట్టె ప్రశ్నలు అడగడం , ఆమె కుటుంబం పై అనుచితమైన వ్యాఖ్యలు చెయ్యడం జరిగింది . దీనిపై ప్రియాంక ఘాటుగా స్పందించారు . ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు , నేరాలు తగ్గకపోగా నేరాలను అరికట్టాల్చిన పోలీసులే మహిళల ఈరకంగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు . యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై మండిపడ్డారు .